యుట్యూబ్ అనేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరికి భాగా చేరువ అయిపొయింది. ఇందులో మెజారిటీ గా ఫ్రీ కంటెంట్ సర్వ్ అవుతూ ఉండటం. అలాగే కంటెంట్ క్రియేట్ చేసే వారికి యుట్యూబ్ నుంచి మంచి ఆదాయం అందుతూ ఉండటంతో చాలా మంది ఉద్యోగాలు వదిలేసి యుట్యూబర్స్ గా మారిపోయి లక్షల నుంచి కోట్ల రూపాయిలు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏడాదికి వందల కోట్ల రూపాయిలు ఆదాయం కూడా యుట్యూబ్ నుంచి తీసుకుంటున్న వారు ఉన్నారు. అలాగే ఎంతో మంది యుట్యూబ్ ద్వారానే చాలా అంశాలు నేర్చుకుంటున్నారు. భాషలపై పట్టు పెంచుకోవడానికి యుట్యూబ్ లో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే చిన్నారుల కోసం కూడా యుట్యూబ్ లో కంటెంట్ ఉంటుంది.
రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు నేర్చుకోవడానికి కావాల్సినంత కంటెంట్ ఉండటంతో కోట్లాది మంది ప్రజలు యుట్యూబ్ మీద ఆధారపడుతూ ఉంటారు. అలాగే సినిమాల ప్రమోషన్ కోసం కూడా యుట్యూబ్ ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిత్వ వికాస వీడియోలు కూడా ఉంటాయి. ఇలా అన్ని విభాగాలలో యూజర్స్ కి కావాల్సిన కంటెంట్ యుట్యూబ్ ద్వారా మాతృసంస్థ గూగుల్ సర్వ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇక కంటెంట్ క్రియేటర్స్ కి మరిన్ని అవకాశాలు ఇవ్వడంతో పాటు కొత్త కోర్సులు నేర్చుకోవాలని అనుకునే వారికి యుట్యూబ్ పెయిడ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ గా మారబోతుంది. విద్యా సంబంధిత వ్యాపారంలోకి కూడా గూగుల్ అడుగుపెడుతుంది.
యూట్యూబ్ లెర్నింగ్ పేరుతో ఈ సిస్టమ్ ని యుట్యూబ్ అందుబాటులోకి తీసుకొస్తుంది. సబ్ స్క్రిప్షన్ విధానం ద్వారా ఈ కోర్సులని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్ణీత కాలపరిమితి విదిస్తూ కంటెంట్ క్రియేటర్స్ తో ఒప్పందం చేసుకొని ఈ రకమైన లెర్నింగ్ సిస్టమ్ ని యుట్యూబ్ లోకి అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అవుతుంది. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఈ యుట్యూబ్ లెర్నింగ్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ కి యుట్యూబ్ నుంచి మరింత ఆదాయం సంపాదించుకునే అవకాశాలు లభించబోతున్నట్లు తెలుస్తుంది. తొలిదశలో భాగంగా తొలుత భారత్, దక్షిణ కొరియా, అమెరికాలో యూట్యూబ్ కోర్సులను ప్రారభించబోతున్నారు.