Guppedantha Manasu August 4 Episode: బుల్లితెరపై ఎంతో ఆసక్తిగా కొనసాగుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో రిషి, హీరోయిన్ వసుధార మధ్య ప్రేమ చిగురిస్తున్న సమయంలో విలన్ సాక్షి ఎంట్రీ ఇచ్చి కథను ఉత్కంఠంగా మార్చింది. ఆలా నడుస్తున్న ఈ సీరియల్ ఎలాంటి ట్విస్ట్ లతో కొనసాగుతుందో.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిన్న ఎపిసోడ్ లో రిషీ ఇంటికి వచ్చిన సాక్షికి దేవయాని ఫుల్ గా వార్నింగ్ ఇస్తుంది. మా రిషి నిన్ను ప్రేమించడం లేదు.. నిన్ను పెళ్లి చేసుకునే అవకాశమే లేదు అని దేవయాని డైరెక్ట్ గా కుటుంబం అందరి ముందు సాక్షికి చెప్పేస్తుంది.. అప్పటి వరకు తనకు సపోర్ట్ ఉండి ఇప్పుడు ప్లేట్ మార్చిన దేవయానిపై సాక్షి ఒక రేంజ్ లో సీరియస్ అవుతుంది. ఇన్నాళ్లు నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఇలా చేస్తారా అని.. రెండు రోజుల్లో రిషికి, నాకు పెళ్లి అని లగ్న పత్రిక రాయకపోతే నా చావుకు మీరే కారణమని రాసి మీ ఇంట్లోనే విషం తాగి చచ్చిపోతానని బెదిరించి వెళ్ళిపోతుంది.
ఆ బెదిరింపులకు కుటుంబం బయపడకపోయిన దేవయాని మాత్రం తన నటన ప్రదర్శిస్తుంది. చూశారా అండి నన్ను ఎలా బెదిరించిందో.. మన కుటుంబం పరువు తీస్తుందంట.. నన్ను కోర్టుకు లాగుతుందట అని భర్త ఫణింద్రతో చెప్తుంది. సాక్షి మంచి అమ్మాయి అని నేను కూడా ఆమె సపోర్ట్ చేశాను ఇప్పుడు చూడండి నన్నే ఇలా బెదిరిస్తోంది అని భయపడినట్టు భర్త ఫణింద్ర ముందు నటిస్తుంది. నువ్వు భయపడద్దులే దేవయాని.. మనం అంత అలోచించి నిర్ణయం తీసుకుందాం అని దైర్యం చెప్తాడు. అప్పుడే జగతిని ఏం చేద్దాం అంటే మీరు పెద్ద వారు ఎలా చెప్తే అలా అని అంటుంది.
ఇక అక్కడే ఉన్న దేవయాని.. వసుధార దగ్గర లేకుండా ఇంటికి రప్పించాలని.. గౌతమ్ తో రిషికి ఫోన్ చెయ్యమని చెప్తుంది. కానీ అక్కడే ఉన్న ధరణి .. ఫోన్ కలవలేదని చెప్పు.. ఎందుకు రిషిని డిస్టర్బ్ చెయ్యడం అని అంటుంది. దాంతో గౌతమ్ ఫోన్ చేసినట్టు నటించి కలవలేదని చెప్తాడు. ఇక మరోవైపు కారు చెడిపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక మెకానిక్ కోసం చూస్తుంటారు. అయితే అప్పుడే ఓ వ్యక్తి వచ్చి మీరు రిషీ సార్ కదా అని అడుగుతాడు. మీకు ఎలా తెలుసు అని అంటే మీరు పెట్టిన మిషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమం వల్లే మా పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్తాడు.

ఆ మాటలు విన్న రిషి, వసు ఎంతో ఆనందపడుతారు. ఆతర్వాత కారు ఆగిపోయిందని చెప్తే వాళ్ళను ఇంటికి ఆహ్వానిస్తారు. కారు రిపైర్ అయ్యే వరకు మా ఇంట్లో ఉండండి.. నేను రిపేర్ చూపిస్తానని చెప్పగా.. వసుధారని అడిగి వస్తాం అని అతనికి చెప్తారు. అయన ఇంటికి వెళ్లిన రిషి, వసుకు గొప్పగా మర్యాదలు చేస్తారు. అక్కడ పిల్లలతో వసుధార కలిసిపోతుంది. ఆ పిల్లలు కూడా వసు, రిషిని గొప్పగా పొగుడుతారు. అప్పుడే ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యమని అడుగుతారు. వాళ్ళు రేఖ్వెస్ట్ చెయ్యడంతో సరేనని చెప్తారు. దాంతో దామోదర్ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది.
ఇక పిల్లలకు వసుధార చదువు చెప్తున్నా సమయంలో కరెంట్ పోతుంది. పక్కింట్లో కరెంట్ ఉంది ఇక్కడ లేదు ఏంటి అని చూడడానికి వెళ్తుంది. ఇక అక్కడ ఫ్యుజ్ పోయిందని గమనించిన వసుధార రిషి సాయంతో అది సరిచేయాలని చూస్తుంది. కరెక్ట్ గా అప్పుడే రిషీపై వసుధార పడుతుంది. ఆ సమయంలోనే వసు కళ్ళల్లో చూసి.. నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది.. కానీ నువ్వు మాత్రం ప్రేమ లేదని చెప్తున్నావ్ అని మనసులో అనుకుంటే వసుధార కూడా మీకు నా ప్రేమ గురించి ఈరోజు చెప్పేస్తా అని అనుకుంటుంది. ఇక ఆతర్వాత ఆ పని పూర్తి చేయగానే కరెంట్ వస్తుంది.
ఇక మరో సీన్ లో దేవయాని ఓవర్ యాక్షన్ గురించి, సాక్షి బ్లాక్ మెయిల్ గురించి జగతి, మహేంద్ర, గౌతమ్ ఆలోచిస్తుంటారు. అసలు సాక్షి అంత దైర్యం రావడం ఏంటి.. దేవయాని అక్కయ్య ప్రవర్తనలో మార్పు ఉంది అని జగతి మహేంద్రతో మాట్లాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.