Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషీ, వసుధార తో నువ్వు మా నాన్నతో గురుదక్షిణ ఒప్పందం చేసుకోవడం నాకు నచ్చలేదు. నువ్వు కోరుకున్న గురుదక్షిణ నెరవేరదు. నీపై నాకున్న ప్రేమ కూడా ఎన్నటికీ తగ్గదు. జగతి మేడం విషయంలో నా మార్పు ఉండదు అంటాడు. జీవితంలో ఏ అడుగు వేసిన ఆలోచించే వేయాలి, ఏ విషయం అయినా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అంటూ అక్కడినుండి కారులో బయలుదేరుతారు.
తర్వాత సన్నివేశంలో ధరణిపై దేవయాని కోపంతో నీ లిమిట్స్ లో నువ్వు ఉండు పెత్తనాలు చేయాలని చూడవద్దు వసు ఈ ఇంటి మనిషి కాదు కదా పెరుగు లో చక్కెర వేసి తినిపించాల్సిన అవసరం ఏముంది అంటూ ఉండగా ఇంతలో జగతి వస్తే చూడు జగతి కాలేజీలో ఒక స్టూడెంట్ నీకు ఇంట్లో కూడా ఒక స్టూడెంట్ దొరికింది. వసుకు పెరుగులో చక్కెర వేసి తినిపించాల్సిన అవసరం ఏముంది. నువ్వైనా బుద్ధి చెప్పు అంటూ ఉండగా ఇంతలో మహేంద్ర కూడా వస్తే ఈ ఇంట్లో నాకు ఎవరు విలువ ఇవ్వడం లేదు. నా మాటను కూడా లెక్క చేయడం లేదు నీ సంగతి అయితే సరే సరి అంటుంది మహేంద్రతో.
అయినా అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పటికీ నేను ఏంటో, ఇక ముందు నేను ఏంటో చూపిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధరణిని జగతి ఓదారుస్తుంది. తరువాత సన్నివేశంలో రిషి, వసుతో శరీరానికి తగిలిన గాయం మానుతుంది కానీ మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మాయదు. నువ్వు నన్ను నా అభిప్రాయాలను మార్చాలని ప్రయత్నించకు నన్ను నాలానే ఉండనివ్వు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తర్వాత సన్నివేశంలో బాధపడుతున్న మహేంద్రతో జగతి నీ ప్రేమలో స్వార్థం ఉంది నాన్న అనే మాటను గుర్తు చేసుకుంటున్నావా అని అడుగుతుంది. అందుకు మహేంద్ర నాకు సరిగా చెప్పడం రావడం లేదు రిషి నా ప్రాణం. నా శరీరంలో ఒక భాగం. కోపం లేదు మనసంతా రిషి పై ప్రేమే ఉంది అంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది అని జగతి బాధపడుతుంటే లేదు నేను వసుతో గురుదక్షిణ అడగడం వల్లే ఇది జరిగింది అంటూ ఇప్పుడు రిషి, వసుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. దేవయాని అక్కయ్య ఈ అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. రిషికి కోపం ఎక్కువ వసు పై ఎంత కోప్పడతాడో ఏమో అంటుంది జగతి.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో రిషి ఒంటరిగా నిలబడి ఎందుకు వసు ఇలా ఆలోచిస్తుంది ఇదంతా అస్సలు జరగదు నా విషయంలో మార్పు ఉండదు అనుకుంటాడు. మరొకవైపు వసు కూడా మీ మనసు చాలా మంచిది సార్ తప్పకుండా మీలో మార్పు వచ్చి జగతి మేడంను అమ్మా అని పిలుస్తారు అనుకుంటుంది. ఇంట్లో మహేంద్ర, గౌతమ్ లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రిషి వస్తే గౌతమ్ నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.