Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు మరిన్ని ట్విస్టులోతో మన ముందుకి వచేసింది. అలాంటి ఈ సీరియల్ ఈరోజు ఆగష్టు 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో దేవయాని ఎక్కువ సార్లు ఫోన్ చేసిందని ఏమైందో అనే ఆలోచనతో ఆమె దగ్గరకు రిషి వస్తాడు. అలా వచ్చిన రిషితో దేవయాని ఇలా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రాణంగా చూసుకున్నా మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు తలిసో తేలియాకో చేసుంటాను నను క్షమించు.. సాక్షి విషయంలో తప్పు చేసాను” అని దేవయాని చెప్తుంది. “పెద్దమ్మ నేను మిమల్ని క్షమించడం ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు” అని రిషి అంటాడు . “లేదు సాక్షి విషయంలో నేను పొరపాటు చేశాను. నాన్న రిషి కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని అంటారు.
నేను ఈ మాట అనడం కరెట్టో కాదదో తెలియదు పెంచిన ప్రేమ ఏంటో నాకు తెలుసు . నాన్న రిషి నాది ఒక చివరి కోరిక ఉంది తీరుస్తావా “అని అడుగుతుంది దేవయాని .”ఏంటో చెప్పు పెద్దమ్మ” అని రిషి అంటాడు . “ఆ గ్లాస్ తీసుకొనిన నీ చేతులతో ఆ విషాన్ని నాకు తాపించు” అని అంటుంది. “పెద్దమ్మ విషం ఏంటి అసలు ఏం జరిగింది” అని రిషి అడుగుతాడు. “సాక్షి విషయంలో నేను తప్పు చేసాను రిషి తన ప్రేమను చూసి నీకు సరైన జోడి అనుకున్న సాక్షికి నీతో పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను.. అలాంటిది ఇప్పుడు నా మాట నిలబెట్టుకోలేకపోతున్న.
సాక్షి మారిపోయింది రిషి నీతో పెళ్లి జరిపించనందుకు నా పరువు తీస్తానంది. నను జైలుకు పంపిస్తానని, కోర్టు మెట్లు ఎక్కిస్తానని కుటుంబ పరువు తీస్తానని ఎన్ని మాట్లాందో “. సాక్షి అన్న మాటలని చెప్తుంది దేవయాని . “సాక్షి ఇంతకీ దిగజారిందా “అని రిషి అంటాడు. ఇంకా దేవయాని చెప్పిన మాటలు విని రిషి ఆలోచించుకుంటూ బయటకి వస్తాడు. “వసుధారని మీరు ఎక్కడికి వెళ్లారు “అని గౌతమ్ అడుగుతాడు. అప్పుడు ధరణి “మనం అడగాల్సింది వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని కాదు రిషి మూడ్ ఎలా ఉంది” అని అంటుంది.
“రిషి సర్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నేను అంచనా వయలేకపోతున్న.. ఒకసారి కూల్ గా కనిపిస్తారు, ఒకసారి సీరియస్ గా కనిపిస్తారు.. సర్ మనసులో ఎం ఉందొ నాకు అర్థం కావడం లేదు. సాక్షి విషయంలో ఆ స్టెప్ తీసుకుంటున్నారో అంచనా వేయలేకపోతున్న. రిషి సర్ కూల్ గా కనిపిస్తున్నారు కానీ బయటకి కనిపించేంత కూల్ గా లేరు ఇది మాత్రం ఖచ్చితం గా చెప్పగలను” అని చెప్పి నేను ఇంకా బయలుదేరుతాను అని అంటుంది . అప్పుడు జగతి లేదు వసు నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండు అని అంటుంది. సరే మేడం అని చెప్పి వసుధార కిందికి వస్తుంది.

Guppedantha Manasu
వసుధారను చుసిన దేవయాని పిలుస్తుంది. ఏంటో ఈ మహాతల్లీ నను పిలుస్తుంది అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. “రిషిని నువ్వే కాపాడగలవు నువ్వు తెలివైనదానివి ధైర్యం వుంది, తగువుంది అన్నిటికి మించి రిషికి నువంటే “అని అంటుంది . “రిషి సర్ ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు, ఏం చెయ్యాలో ఎం చెయ్యకూడదో రిషి సర్ కి తెలుసు. అయిన సాక్షికి మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాలేదు . “అని వసుధారా అంటుంది.
“ఏనుగు పెద్దదే అయిన చిన్న ముల్లు కూడా ఏనుగుని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఆ ముల్లు సాక్షి. నువ్వు సాక్షితో జాగ్రత్తగా ఉండు. అయిన నాకు అన్ని రిషి తరువాతే” అని దేవయాని అంటుంది. సరే మేడం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. “ఉదయానే రిషి బాల్కనీలో నిలబడుకొని వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ వుంటాడు. అప్పుడే వసుధార సర్ కాఫీ అని కాఫీ ని ఇస్తుంది. సారీ వద్దు అని రిషి అంటాడు.
రిషి సర్ కాఫీ వద్దంటున్నారేంటి అది ఈ టైంలో అని అనుకోని కాఫీని పక్కన పెడుతుంది . రిషి “వద్దని చెప్తునాన “అని అంటాడు . “ఒకోసారి మొదట వద్దనుకున్నా తరువాత కావాలనిపించొచ్చు.. ఒకసారి ఆలోచించండి సర్” అని వసుధార అంటుంది. వద్దని చెప్పను కదా అని రిషి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు . ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తివుతుంది . తరువాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే ….