Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జగతి, వసు వద్దకు వెళ్లి నీకు రిషికు మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని ప్రశ్నిస్తుంది. వసు అలాంటిదేమీ లేదు మేడం అంటే గురుదక్షిణ విషయం గురించి మాట్లాడుకోలేదా అని నిలదీస్తుంది. జగతి నువ్విక గురుదక్షిణ విషయం గురించి మర్చిపో.. రిషి నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు నావల్ల నీ జీవితం పాడవుతుంది అని నచ్చ చెబుతుంది. అందుకు వసు రిషి సార్ మీ అబ్బాయి నేను కచ్చితంగా మార్చుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది అని చెబుతుంది. ఇందుకు జగతి ఇదంతా మహేంద్ర వాళ్ళనే వచ్చింది అసలు మహేంద్రను అనాలి నాకు ఇప్పుడు అమ్మ అని పిలిపించుకోవడం కంటే నీ జీవితమే ఇంపార్టెంట్ అని చెప్పిన వసు వినకపోవడంతో బాయ్ వాసు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
తర్వాత సన్నివేశంలో జగతి ఇంటికి వచ్చి మహేంద్ర తో నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ సూట్ కేస్ లో బట్టలు సర్దుకుంటుంది. అప్పుడు మహేంద్ర నిన్ను వదిన గారు ఏమైనా అన్నారా, లేదంటే రిషి ఏమైనా అన్నాడా ఎందుకు వెళ్లిపోతున్నావు అంటే నా కారణంగా రిషి,వసుల మధ్య దూరం పెరుగుతుంది. నువ్వు ఆ వసుధార కలిసి చేసుకున్న గురుదక్షిణ ఒప్పందం వల్లే సమస్య రోజురోజుకు పెరుగుతుంది అంటుంది. ఇప్పుడు మహేంద్ర నేను వసుతో మాట్లాడతాను అంటే ఇంతకుముందే నేను మాట్లాడాను అస్సలు నా మాట వినడం లేదు.
ఎందుకు నా విషయంలో రిషి ని ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. అప్పుడు మహేంద్ర నువ్వు వెళ్ళిపోతే సమస్య తెలుగు పోతుందా అని ప్రశ్నిస్తాడు. నేను వెళ్ళిపోతే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాళ్ల మధ్య నా టాపిక్ అవసరం లేనప్పుడు వాళ్లు దగ్గరయ్యే అవకాశం ఉంది మహేంద్ర అంటుంది. జగతితో నేను కూడా నీతో పాటే వస్తాను అంటే తర్వాత రిషి పరిస్థితి ఏంటి నీ వల్ల రిషికి ఏ విధమైన బాధ కలగకూడదు. రిషి ని జాగ్రత్తగా చూసుకో అంటూ నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను అంటూ ఉండగా ఇంతలో రిషి వస్తాడు.
Guppedantha Manasu:
జగతి చేతిలో సూట్ కేస్ చూసి రిషి వెళ్ళిపోతున్నారా మేడం. చాలా తెలివిగా ఆలోచిస్తారని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. మీరు వెళ్లడానికి నన్ను కారణంగా పెట్టుకోవడం ఏంటి మేడం. మా నాన్న సంతోషం కోసం మిమ్మల్ని ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చాను. మీరు వచ్చాక మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అది రోజు నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు ఇష్టం లేకపోయినా నీ మ్యారేజ్ డే ఫంక్షన్ జరిపించాను. నా చిన్నప్పుడు మీరు ఎందుకు వెళ్లిపోయారు అని నేనెప్పుడూ ప్రశ్నించను కానీ ఈరోజు మీరు ఇలా ఒంటరిగా వెళ్లకుండా మా నాన్నను కూడా తీసుకువెళ్లండి. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమయ్యాను ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేసుకుని బతకడం నేర్చుకుంటాను. మీకు ఆ వసుధార కు నీతులు వర్ణించడం బాగా తెలుసు కానీ పట్టుదలతో ఎవరి ప్రమేయం లేకుండా మీరే నిర్ణయాలు తీసుకుంటారు అంటాడు. ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి ఎందుకు మహేంద్ర రిషి సంతోషంగా ఉండడం మీకు నచ్చదా, కావాలని ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.