Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషి, వసుపై కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళను మీతో పాటే ఇక్కడే ఉంటాను అని మొండిగా మాట్లాడుతుంది. తరువాత రిషి క్యాబ్ బుక్ చేసి వసును ఇంటికి వెళ్ళమని చెప్తాడు. మరోవైపు రిషి ఫోన్ లిఫ్ట్ చేయలేదని మహేంద్ర, జగతిలు బాధపడుతూ దేవయానితో ఫోన్ చేయమని జగతి ప్రాధేయపడుతుంది. అప్పుడు దేవయాని జామ చెట్టుకు మామిడి కాయలు కాయవు. నీవు చెప్తే నేను ఎలా కాల్ చేస్తాను అంటుంది.
ఇంతలో రిషి వస్తాడు. రిషి చేతిని చూసి దేవయాని చాలా కంగారు నటిస్తూ ఏమైందో చూసి అని ప్రశ్నిస్తుంది. అందుకు రిషి నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు దేవయాని అందరూ విన్నారు కదా కాసేపు రిషి ని ఒంటరిగా వదిలేయండి అంటుంది. ఇంతలో వసు ఇంటికి వస్తుంది. వసు, రిషి రూమ్ లోకి వెళ్ళడానికి చూసి చాలా చిరాకుగా జగతిని పిలుస్తుంది. జగతి రిషి కోసం భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దేవయాని ఆ ప్లేట్ తీసుకొని మీకు రుషి రూంలో ఒక అద్భుతం చూపిస్తాను పదండి అని చెబుతుంది. ఇంతలో అక్కడ వసు ను చూసి అంత ఆశ్చర్యపోతారు.
దేవయాని రిషికి భోజనం చేయమంటే ఆకలిగా లేదు అంటాడు. మరొకవైపు జగతి టాబ్లెట్లు వేసుకోవాలి కదా కాస్తయినా తింటే చెయ్యి నొప్పి తగ్గుతుంది అని అంటుంది. తర్వాత వసు, దేవయాని చేతిలో నుండి ప్లేట్ తీసుకొని బలవంతంగా తినండి అంటూ చేత్తో తినిపిస్తుంది. ఇది చూస్తున్న దేవయాని ఆశ్చర్యంగా చూస్తుంది. మిగతా కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు. తర్వాత అందరు అక్కడినుంచి వెళ్ళిపోతారు దేవయానికి కూడా వెళ్తుండగా పెద్దమ్మ మీరు ఉండండి అంటాడు రిషి. అప్పుడు దేవయాని కాస్త పని ఉంది మళ్లీ వస్తాను అంటూ బయటకు వెళ్తుంది.
రిషి, వసుతో ఈ సమయంలో ఎందుకు వచ్చావు అంటే మీరే చెప్పారు కదా ప్రేమ వేరు కోపం వేరు ఒకదానికోసం మరొక దానిని దూరం చేయకూడదని అందుకే వచ్చాను అంటుంది. సరే వెళ్లేటప్పుడు గౌతమ్ కార్ లో డ్రాప్ చేస్తాడు అంటాడు రిషి. అందుకు వసు ఇవన్నీ మీకు నచ్చవు కదా నేను ఒంటరిగా ఉంటేనే మీకు ఇష్టం అంటూ కాస్త నీళ్లు తాపి బయటకు వస్తుంది. రిషి మనసులో వసు కు చాలా పొగరు కానీ ఆ పొగరులో చాలా ప్రేమ కనిపిస్తుంది అనుకుంటాడు. బయట దేవయాని వసు ఏంది ఇలా చేస్తుంది అయినా రిషి ఏం మాట్లాడలేదు అని చిరాకుగా ఆలోచిస్తూ ఉంటుంది.
Guppedantha Manasu:
మరొకవైపు మహేంద్ర, జగతి, గౌతమ్ లు ఎలాగైనా రిషి, వసు లని దగ్గర చేయాలి. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉంది. అనవసరంగా పట్టుదలకు పోయి దూరమవుతున్నారు ఏదో విధంగా చేసి ఇద్దరు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకునే విధంగా చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా గౌతం, జగతితో కాలేజీలో అయితే బాగుంటుందేమో అంటాడు. అప్పుడు మహేంద్ర ప్రస్తుతం హాలిడేస్ కదా ఎలా కుదురుతుంది అంటే జగతి మీటింగ్స్, మిషన్ ఎడ్యుకేషన్ ఉంది కదా అని అనుకుంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.