Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 21వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషీ, వసుధార వద్దకు వస్తాడు. సడన్ గా రిషీ రావడంతో వసుధార లో చాలా కంగారు పెరుగుతుంది. ఏం చేస్తున్నావ్ వసుధార అంటే ఏం లేదు సార్ అంటుంది వసుధార. తర్వాత కొంత డబ్బును రిషీ, వసు చేతిలో పెట్టి నీకు డబ్బు ఎందుకు అవసరమో నాకు తెలియాల్సిన పనిలేదు. ఇక ముందు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, ఈ డబ్బును రెస్టారెంట్ మేనేజర్ కు ఇవ్వు అంటూ ఒక బుక్ తీసుకుని అందులో రెండు మూడు చాప్టర్లు ఇంపార్టెంట్ ఈరోజు నైట్ చదివి నాకు రేపు పొద్దున అప్పజెప్పాలి అంటాడు.
తరువాత సన్నివేశంలో ఉదయం కాఫీ తాగుతూ వసుధార ఏం చేస్తూ ఉంటుందో అనుకుంటూ ఫోన్ చేద్దాం అనుకుంటాడు రిషీ. ఎందుకు ఫోన్ చేశారు అని అడిగితే ఏం చెప్పాలి, అనుకుంటూ ఉండగా ఇంతలో గౌతమ్ వస్తాడు. తరువాత వసు, ఋషికి ఫోన్ చేస్తుంది. గౌతమ్ ఫోన్ లక్కొని లిఫ్ట్ చేసి బాగున్నవా వసుధార, కాఫీ తాగావా ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నాను సార్ మీ ఇంట్లోనే హాల్లో అంటే దానికి రిషి హాల్లోకి వస్తుంటాడు. తరువాత వసు చూసి ధరణి కాఫీ తీసుకువస్తానంటే అది గమనించిన దేవయాని అక్కడికి వచ్చి కాఫీ ఏం అవసరం లేదు. తాను ఏమీ ఇంటికి కొత్త కాదు తను ఒక కాలేజీ స్టూడెంట్ నువ్వు వెళ్ళు అంటూ ధరణిపై కోప్పడుతుంది.
ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావని దేవయాని, వసు ధారను అడుగగా దానికి బదులుగా రిషి సార్ రమ్మన్నారు అంటుంది. రోజు కాలేజీలో మాట్లాడుకుంటారు కదా, అది సరిపోడం లేదా అంటే ఏమో మేడం మీరు అడగమన్నారని సార్ కు అడుగుతాను అంటుంది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు నేను ఏం చేశాను అనే లోపు రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు దేవయాని నాన్న రిషి ఇంత పొద్దున్నే వసును పిలిచావా అంటే మీరు వెళ్ళండి పెద్దమ్మ నేను మాట్లాడతాను అంటాడు. తర్వాత ఎందుకు వచ్చావని అడగక మీరే కదా సార్ నిన్న రాత్రి నేర్చుకున్నది ఉదయమే అప్ప చెప్పాలి అన్నారు కదా, ఆ అంటే కాలేజీలో చెప్పొచ్చు కదా అంటాడు రుషి. టైం వేస్ట్ ఎందుకని పొద్దున్నే వచ్చాను అంటుంది సరే కాలేజీలో కలుద్దాం. నువ్వు వెళ్ళు అంటాడు రిషి. ఇంతలో గౌతం అక్కడికి వస్తాడు. అప్పుడు గౌతమ్ తో రిషి మేము చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాము నువ్వు వెళ్ళు అంటే గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వసు కూడా వెళ్తుంది.
తరువాత సన్నివేశంలో మహేంద్ర, జగతితో మన పుత్రరత్నం ఏమి అర్థం కావడం లేదు. మనసులో ఏముందో తెలియదు. ఏమన్నా అంటే జీవితం అది ఇది అని లెక్చర్స్ ఇస్తుంటాడు అనే లోపు గౌతమ్ అక్కడికి వస్తాడు. రిషికి మనసులో ఎటువంటి బాధ లేదు పొద్దున్నే ఇంటికి వచ్చిన వసును తిరిగి పంపించేశాడు . జగతి వెంటనే వసుధారకు ఫోన్ చేస్తుంది. మీ అబ్బాయి ఒక పని చెప్పారు ఆ పని చేశాను అంతే, సరే చదువుపై దృష్టి పెట్టు నువ్వు గెలవాలి వసు అంటే బదులుగా గెలుస్తాను మేడం అంటూ ఫోన్ పెట్టేస్తుంది. తరువాత వసుధారకు సాక్షి కనపడి ఎలా ఉన్నావు వాసు అవును ఇంతకు ఆ ఉంగరం ఏమైనాటు నీ వేలికి తొడిగి ఉంటారు అనుకున్నాను అంటే ఉంగరం ఏముందిలే బంగారం లాంటి విషయాలు వదులుకున్నావు కదా అంటే రిషి బంగారం కాదు రోల్డ్ గోల్డ్, రిషితో ప్రయాణం చిల్లిపడ్డ బోటులో ప్రయాణం చేస్తున్నట్టే అంటుంది సాక్షి దానికి బదులుగా వసు ఒకరకంగా చెప్పాలంటే చిల్లిపడిన బోటులో కూడా వడ్డు చేరవచ్చు. కానీ ఇతరుల మాటలు నమ్మి అలా చేయడం పారాషూట్ లేకుండా విమానంలో నుంచి దూకడమే. రిషీ సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీ శుభలేఖ ఫోన్లో పంపించు సంతోష పడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో వసుధార, రిషి కార్ వద్దకు వచ్చి అక్కడ రిషి లేడు అనుకుని, ఏంటి సార్ మీరు నాకు అర్థం కారు మీరే కదా ప్రశ్నలు ఇచ్చి నేర్చుకోమన్నారు నేర్చుకున్నాను అయినా మీరు చెప్పిన ప్రతి పని తప్పకుండా చేస్తున్నాను. మీరేమో ఎప్పటికీ అర్థం కారు మీరు చెప్పిందే వినాలా వేరే వాళ్ళు చెప్పింది మీరు వినరా మీరు జెంటిల్మెన్ కదా సార్ అందుకే. మీరు జెంటిల్మెన్ అయితే మరి నేను ఎవరిని అంటూ, ఒకవేళ మీరు కనపడితే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చెడాపెడ వాయించేస్తాను. అయినా మీరు ఇద్దరు పడితే ఏం ప్రశ్నలు అడుగుతాను ఏం అడుగుతాను నాకే తెలియదు అనుకుంటూ ఉండగా కారుకు అవతల వైపు ఉన్న రిషీ అద్దంలో నుంచి వసును చూస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.