Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో దేవయాని, వసుధార ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి వసుతో, సాక్షితో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ కావడంతో రిషీ డిస్టర్బ్ గా ఉన్నాడు. నాపై మహేంద్ర, జగతిలు కోపంగా ఉన్నారు. నువ్వు ఒక పని చేస్తే అంతా సర్దుమనుగుతుంది అంటుంది దేవయాని. మహేంద్ర, జగతిల మ్యారేజ్ డే ఫంక్షన్ ని ఇంట్లో జరిపించేలా రిషీని నువ్వే ఒప్పించాలి, సాక్షి వెళ్ళిపోయినప్పటినుండి నేను డిస్టర్బ్ గా ఉండి రిషితో సరిగా మాట్లాడలేకపోతున్నాను, రిషి కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోతున్నాను కావాలంటే రిషి ని ఒప్పించి నేను ఫంక్షన్ చేయగలను.
రిషి నా మాటకు ఎదురు చెప్పకుండా సరే అంటాడు. కానీ నేను చేస్తే మహేంద్ర, జగతీలు అంత సంతోషంగా ఉండరు. కానీ నువ్వు రిషిని ఒప్పిస్తే జగతి తన కొడుకు మ్యారేజ్ డే చేశారని సంతోషపడుతుంది అంటే, వసు సరే అంటూ ఉండగా ఇంతలో రిషీ వచ్చి పెద్దమ్మ మీరేంటి ఇక్కడ అంటే ఇటువైపుగా వెళ్తున్న వసు ను పలకరిద్దామని ఇక్కడ ఆగాను అంటే, సరే అనుకొని ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతారు. తర్వాత సన్నివేశంలో రిషీ, వసులు కలుసుకొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలని ఒకరికి తెలియకుండా ఒకరికి మెసేజ్లు పెట్టి లొకేషన్లు షేర్ చేసి ప్లాన్ చేస్తాడు గౌతం.
ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు తింటూ మాట్లాడుకోవచ్చు కదా అని మెసేజ్ పెడితే వీడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు కానీ అరేంజ్మెంట్స్ బాగా చేశాడు అని నేనే సర్వ్ చేస్తాను అంటాడు రిషీ. వసుకు సర్వ్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ నువ్వు రోజు రోజుకు చాలా అందంగా కనపడుతున్నావు అంటాడు. తరువాత రిషి ని చూస్తూ ఉండగా ఏంటి ఇలా చూస్తున్నావు అంటే మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీకు నవ్వడం రాదా అని అనుకున్నాను అంటుంది. తర్వాత ఇద్దరూ రొమాంటిక్ గా చూసుకుంటూ తింటూ ఉండగా రిషి చేతిలో నుండి స్పూన్ కింద పడిపోతుంది. అప్పుడు వసు వేరే స్పూన్ ఇస్తూ ఉండగా వసు తిన్న స్పూన్ తీసుకొని తింటే ఈ జెంటిల్ మెన్ కు ఇలాంటి సరదాలు కూడా తెలుసా అని అనుకుంటుంది.
Guppedantha Manasu:
తరువాత గౌతమ్ కు థాంక్స్ చెప్పుకోవాలి ఇలా అరేంజ్ చేసినందుకు అంటూ ఇద్దరూ ఆకాశం వైపు చూస్తూ, రిషీ, వసు తో నీ ఫ్రెండ్స్ ఆకాశం, చందమామ, నక్షత్రాలతో ముచ్చట్లు పెట్టకుండా నాతో మాట్లాడు అంటే ఇద్దరు నవ్వుకుంటారు. తర్వాత గౌతం మెసేజ్ చేస్తాడు అక్కడ గ్రీన్ టీ కూడా ఉంది తాగుతూ మాట్లాడుకోండి అంటే రిషి గ్రీన్ టీ కలిపి వసుకు ఇచ్చి ఇద్దరూ రొమాంటిక్గా తాగుతుండగా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.