మంగళవారం ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు లోగోను ఆవిష్కరించి మాట్లాడుతూ… జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 68 శాతం తల్లిపాల రేటు ఉందని, జాతీయ సగటు 63 శాతానికి మించిందన్నారు.
నవజాత శిశువు శ్రేయస్సుతో పాటు తల్లి ఆరోగ్యంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ సీఓఓ విశ్వనాథ్ స్వరూప్, ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.