టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు రామ్. కమర్షియల్ హీరోగా తనని తాను రిప్రజెంట్ చేసుకొని కెరియర్లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ రామ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన రెడ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ది వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో నటించాడు. ఇక ఆది పినిశెట్టి సినిమాలో ప్రతి నాయకుడిగా నటించాడు. క్రేజీ బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీలో రామ్ కి జోడిగా నటించింది. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ ను మొదటిసారిలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరపై చూడటంతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో నడిచిన కూడా రాముని ఇతరహాలో చూడడంతో సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. హీరో రామ్ విలన్ ఆది పినిశెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు మరింత బలంగా ఉంటే బాగుండేదని అభిప్రాయం వినిపిస్తుంది.
ఇక హీరోయిన్ కృతి శెట్టి పాత్ర ఎప్పట్లోకి కమర్షియల్ హీరోయిన్ ఫార్మాట్లో పాటలకే ఎక్కువగా పరిమితమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ మూవీతో రామ్ కెరియర్లు మరో హిట్ బొమ్మ పడినట్లే అని అభిప్రాయం వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు సినిమా టెస్ట్ మారడంతో ప్రోటీన్ దొంగ పోలీస్ కథతో వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.