Congress Party: కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవరికీ వారు ఎన్నికలలో గెలుపు కోసం తమ వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నాయి. అస్సలు తగ్గేది లే అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఈ సారి బలమైన స్థానాలలో గెలిచి అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి ఒంటరిగా రావాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇక కుమారస్వామి జేడీఎస్ బలం ఎంత అనేది అందరికి తెలిసిందే. వారు గట్టిగా ఫైట్ చేసిన 30 నుంచి 35 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంటుంది.

అయితే ఈ సారి బీఆర్ఎస్, జేడీఎస్ కలిపి కర్ణాటక మొత్తం పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కేసీఆర్ కూడా బలమైన వ్యూహాలు సిద్ధం చేయడంతో పాటు తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు జిల్లాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో భేటీ కావడం కర్ణాటకలో సంచలనంగా మారింది. కిచ్చా సుదీప్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళ రాష్ట్రాలలో సినీ నటులు రాజకీయాలలోకి వెళ్లి సక్సెస్ అవుతున్నారు.
ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించారు. అయితే కర్ణాటకలో సినిమా నటులు రాజకీయాలకి కొంత దూరంగా ఉంటారు. అయితే కొంత మంది నటులు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. గతంలో సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టిన మళ్ళీ అంత యాక్టివ్ గా లేరు. అయితే కిచ్చా సుదీప్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి స్టార్ క్యాంపెయినర్ గా రిప్రజెంట్ చేయడం ద్వారా కొంత లాభం ఉంటుందని డీకే శివకుమార్ భావించి అతన్ని పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.