వైసీపీ అధినేత జగన్ కి హైపర్ ఆది వార్నింగ్ ఇచ్చాడు..పవన్ కళ్యాణ్ చాలా మొండోడంటూ హెచ్చరించారు. భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీపై ప్రశంసలతో హైపర్ ఆది స్పీచ్ బాగా అదరగొట్టారు. ‘వెంకట్రావుకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు మెగాస్టార్ చిరంజీవి. రెండో కొడుకు నాగబాబుని కాస్త తక్కువ చేసి మాట్లాడతారు. కానీ టీవీ ఇండస్ట్రీలో మాలాంటివాళ్ల ఎందరికో జీవితాన్ని ఇచ్చారు.
మూడో కొడుకు పవర్ స్టార్. అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారు. కానీ తమ్ముడు మొండోడు తాడోపేడో తేల్చుకుంటాడు’ అంటూ మాట్లాడారు. అలాగే.. అంబటి రాంబాబు, రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి.. కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరి లెక్కలన్నీ పవన్ కళ్యాణ్ తేల్చుతాడని హెచ్చరించాడు. త్వరలోనే పవన్ కళ్యాణ్ వారందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు హైపర్ ఆది.