ప్రముఖ కోలీవుడ్ హీరో లలో ఒకడు విశాల్ . విశాల్ కు అటు కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ చేసిన సినిమాలను ఇక్కడ విడుదల చేస్తూ భారీ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంటుంన్నారు . అయితే ఈమధ్య ఏమైందో తెలియదు కానీ విశాల్ కి పెద్దగా కలిసి రావట్లేదు అని చెప్పవచ్చు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా దాదాపు డిజాస్టర్ గానే నిలిచిపోయాయి . ఈ క్రమంలోనే ఆయన తాజాగా పగడ్బందీగా సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా విశాల్ నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.
ఇందులో విలన్ గా ఎస్ జె సూర్య నటిస్తుండగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చేపట్టింది సినిమా కి సంభందించిన బృందం. అందులో భాగంగానే విశాల్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి బాగా వివరించాడు . విశాల్ మాట్లాడుతూ.. నేను ఒక భారీ యాక్షన్ సీన్ చేసేటప్పుడు సెట్ లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఒకరకంగా నేను చనిపోతాను అనుకున్నాను కానీ తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాను.
ఫైట్ సీన్ ముగించి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక పెద్ద ట్రక్ నా వైపు వచ్చింది. కరెక్ట్ టైం కి నేను దాన్ని గుర్తించి తప్పుకున్నాను. దాంతో ఆ ట్రక్ కాస్త బలంగా సెట్ ను ఢీ కొట్టింది. ఇక నేను ఏమాత్రం గమనించకుండా ఉండి ఉంటే ఆ రోజేనే నా చావు మీ ముందు ఉండేది. ఈ ఘటన జరిగాక పది నిమిషాల పాటు నేను కోలుకోలేకపోయాను . ఇక నాకు అది పునర్జన్మలా అనిపించింది అంటూ విశాల్ చాల ఎమోషనల్ గా అయ్యాడు.