గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ జంట ప్రస్తుతం హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వీరు పెళ్లయిన 11 సంవత్సరాలకి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ పాపకు “క్లింకారా” అనే పేరుని కూడా నామకరణం చేశారు. ఇక వీరికి పాప పుట్టినప్పటినుంచి అదృష్టం కలిసి వస్తుందని తెగ సంబర పడిపోతున్నారు మెగా కుటుంబ సభ్యులు. ఇక క్లింకారా కోసం ఇంట్లో చాలా మార్పులు చేస్తున్నారు.
ఇక ఈ మధ్యలోనే క్లింకారా బారసాల ఘనంగా జరిపించారు. రామ్ చరణ్ గారాలపట్టికి విలువైన బహుమతులు చాలా వచ్చాయి. ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఎన్టీఆర్… చెర్రీ కూతురు కోసం బంగారంతో తయారు చేసిన డాలర్ ను అద్భుతంగా డిజైన్ చేయించి గిఫ్ట్ గా ఇచ్చారంత . ఇక తాజాగా అల్లు అర్జున్ క్లింకారాకు ఒక అద్భుతమైన బహుమతిని పంపించాడట. అల్లు అర్జున్ బంగారు పలకను తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చాడట.
![మెగా ప్రిన్సెస్ క్లీంకారకు ఐకాన్ స్టార్ స్పెషల్ గిఫ్ట్…? 2 మెగా ప్రిన్సెస్ క్లీంకారకు ఐకాన్ స్టార్ స్పెషల్ గిఫ్ట్…?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-05T174146.424.jpg)
బంగారంతో పలక ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. ఆ బంగారు పలకపై క్లింకారా పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా ఆ పలకపై డిజైన్ చేయించారట. ఇక అల్లు అర్జున్ ఐడియా చాలా కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అల్లు కుటుంబం, కొనిదెల కుటుంబం మధ్య గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ గొడవలు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్య ప్రేమాభిమానాలు చాటుకుంటారు ఇరు కుటుంబ సభ్యులు.