కథ : మోహన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. మధ్య తరగతి కుటుంబ అతడిది. అయితే అతడికో సమస్య ఉంది. నిద్రపోయాడంటే.. గురక పెడితే పక్కింటివాళ్లు కూడా భయపడిపోవాలి. ఆఫీసులో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓ రోజు కలిసి బస్సులో వెళ్తుంటారు. చల్లని గాలి వస్తుంటే.. ఓ అరంగంట నిద్రపోతాడు. కానీ గురక మాత్రం దారుణంగా పెడతాడు. తన బావతో కలిసి ఒక రోజు ఇంటికి వెళ్తాడు.
అక్కడ అను(మీతా రఘునాథ్)ను చూస్తాడు. అనుతో పరిచయం అవుతుంది. అది ప్రేమ వరకూ దారి తీస్తుంది. మెుత్తానికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మెుదటి రాత్రి రోజునే.. అనుకు మోహన్ గురక పెడతారనే విషయం అర్థమవుతుంది. గురక సమస్య తగ్గించుకేనేందుకు మోహన్ ఏం చేశాడు? మోహన్-అను కలిసే ఉన్నారా? గురక సమస్యతో హీరోకు వచ్చిన కష్టాలేంటి? అని తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో ఓన్లీ కామెడీ మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండాయనే చెప్పాలి. భార్య పడే ఇబ్బందులకు ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. గురక తగ్గించుకునేందుకు హీరో చేసే పనులు కూడా ఉన్నాయి . వాళ్ళ భార్య పడే కష్టాన్ని చూడలేక పక్కకి వెళ్ళిపోతాడు .
‘గుడ్ నైట్’ సినిమా రివ్యూ :
యూట్యూబ్ చూసి.. తగ్గించుకోవాలని అనుకుంటాడు.. ఈ సమయంలో ప్రేక్షకులు నవ్వుకుంటారు.అయితే అలాంటి సీన్స్ మళ్లీ మళ్లీ రావడం ఓ మైనస్ గా చెప్పవచ్చు. కాస్త ఫ్యామిలీ డ్రామా కూడా స్లోగా సాగుతుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉంటాయి. ఇంకాస్త నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నటులు కూడా ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు కుమ్మేశారనే చెప్పాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు దర్శకుడు. పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చిన్నగానే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. మెుత్తానికి ఓ క్లీన్ ఎంటర్టైనర్ చూడాలంటే గుడ్ నైట్ సినిమా బెస్ట్. తెలుగులోనూ అందుబాటులో ఉంది.