ఎన్టీఆర్ ధరించిన వాచ్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయిన ఎన్టీఆర్ తాజాగా తన సోదరి సుహాసిని కుమారుడి పెళ్లిలో పాల్గొని పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. ఆ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారింది.
![ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..! 2 ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-24T110334.130.jpg)
Patek Philippe అనే కంపెనీకి చెందిన వాచ్ .. ఇది చాలా అల్ట్రా స్టైలిష్ లుక్ తో బాగా కనిపిస్తోంది. ఇక దీని విలువ అక్షరాలా రూ.2.45 కోట్లు అంట .. దీని ధర చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారంట . ఇకపోతే ఇలాంటి వాచ్ లు ఎన్టీఆర్ వద్ద చాలానే ఉన్నాయని చెప్పారు . ముఖ్యంగా గతంలో కూడా ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధరలు నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్కో సినిమాకి కోట్ల రేంజ్ లో పారిపోషకం తీసుకునే ఎన్టీఆర్ ఈ మాత్రం ఖరీదు వాచ్ లు ధరించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు మేనల్లుడు పెళ్లి కావడంతో అంతా తానై దగ్గరుండి చూసుకున్న ఎన్టీఆర్.. తన అన్న కళ్యాణ్ రామ్, సోదరుడు మోక్షజ్ఞతో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.