బాలీవుడ్ క్రేజీ నటుడు సైఫ్ అలీఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రావణుడి వేశంలో ఆదిపురుష్ సినిమా లో అందరినీ ఆకట్టుకున్న సైఫ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా లో కూడా కనిపించబోతున్నాడు. ఈ నటుడు ఇటీవలే తన 53వ పుట్టిన రోజు ను జరుపుకున్నాడు. నటనకు మాత్రమే కాకుండా తనకు ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కూడా సైఫ్ అలీ ఖాన్ చాలా వాటిలలో బాగా ప్రసిద్ధి చెందాడు. సైఫ్ అలీఖాన్ రాజా కుటుంబీలకు చెందిన వాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఇండస్ట్రీలో ఇతర ఆర్టిస్టులతో పోలుచుకుంటే సైఫ్ పఅలీ ఖాన్ నెట్ వర్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతని వద్ద ఉన్నటువంటి విలువైన ఆస్తుల గురించి ఇప్పుడు మనందరం తెలుసుకుందాం.
![సైఫ్ అలీఖాన్ కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ..? షాక్ అవుతారు 2 సైఫ్ అలీఖాన్ కి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ..? షాక్ అవుతారు](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-18T121300.106.jpg)
సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ తండ్రి ఎవ్వరో కాదండోయ్.. ప్రముఖ భారత దివంగత క్రికెటర్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.వీరిది నవాబుల కుటుంబం కావడంతో హర్యానాలో చరిత్ర కలిగి ఉన్న పటౌడీ ప్యాలెస్ కూడా ఉంది. సుదీర్ఘ వారసత్వాన్ని కలిగి ఉన్న దీని విలువ సుమారు రూ.800 కోట్లు. ఇంత చరిత్ర కలిగిన పటౌడీ మాన్షన్ ను సైఫ్ సినిమా షూటింగ్ లకు అద్దెకు ఇస్తుంటాడు. ఈ మధ్య కాలంలో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న మూవీ అనిమల్ కి అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్యాలెస్ ని రెంట్ కి ఇచ్చి సైఫ్ ఎంత సంపాదించాడో మన ఊహకి అందదు. సైఫ్, అతని భార్య కరీనా కపూర్ జీ స్టాడ్ లో కొనుగోలు చేసిన చాలెట్ లో కనిపించారు. చాలెట్ కోసం సైఫ్ రూ.35కోట్లు ఖర్చుచేసినట్టు తెలుస్తుంది. సైఫ్ కి కార్లు అంటే చాలా ఇష్టం.
మెర్సిడెస్ బెంజ్ నుంచి రేంజ్ రోవర్ వోగ్ వరకు అనేక కార్లు తన కలెక్షన్లుగా భద్రపరచుకున్నాడు. అతని కార్ల విలువ దాదాపు 6 నుంచి 7కోట్ల వరకు ఉంటోంది . రూ.70లక్షలు విలువ కలిగిన రోలెక్స్ వాచ్ ను ఓ నవాబ్ సైఫ్ అలీఖాన్ కి బహుమతిగా ఇచ్చాడట. ఇది మామూలు వాచ్ కాదండోయ్ . బంగారంతో మెరుగులు చేసి వజ్రామూల లతో అలంకరించిన లిమిటేడ్ ఎడిషన్ వాచ్ అంట. ఇటీవల తన విలాసవంతమైన అపార్టుమెంట్ నుంచి బయటికి వెళ్లి పెద్ద విల్లాకు మారాడు. ఫార్చ్యూన్ హైట్స్ సుమారు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు అద్దెకు తీసుకోవచ్చు . దీని విలువ దాదాపు 4.2 కోట్ల వరకు ఉంటుంది. సైఫ్ కొత్త ఇల్లు విలువ రూ.6కోట్లు. ఇవే కాకుండా ఇతర వ్యాపారాల నుంచి ఏడాదికి రూ.30కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు . మొత్తానికి అలీఖాన్ ఆస్తి విలువ రూ.1400 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం కూడా ఇచ్చారు . బాలీవుడ్ లో కుబేరుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు సైఫ్ అలీఖాన్.