ప్రముఖ కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, విలనిజంతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి నటించే అతి కొద్ది మంది నటులలో కమెడియన్ సునీల్ కూడా ఒకరిని చెప్పాలి. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వంటి వారు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలోనే వాళ్లకు పోటీగా వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయారు . ఇక కమెడియన్ గా చేస్తున్నప్పుడే అనూహ్యంగా అందాల రాముడు అనే సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత ఏకంగా రాజమౌళితోనే మర్యాద రామన్న సినిమా చేసి బంపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు .
![ఆ విషయంలో అక్కడివారిని కూడా మడత పెడుతున్న సునీల్.. 2 ఆ విషయంలో అక్కడివారిని కూడా మడత పెడుతున్న సునీల్..](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-17T114226.306.jpg)
కమెడియన్ గా ఒక స్టాంపు వేసుకున్న సునీల్ ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేయలేదంట . దాంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవింద సమేత సినిమా ద్వారా మళ్లీ తన కెరీర్ ను మొదలుపెట్టాడు . ఇక ఇప్పుడేమో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాత్ర విషయంలో ఎటువంటి కండిషన్స్ లేకుండా నటిస్తున్న ఈయన క్రేజ్ ఇప్పుడు తమిళ తంబీలలో కూడా పాకిపోయింది. అక్కడి జనాలు సునీల్ వెండితెరపై కనిపిస్తే.. ఈలలు, గోలలతో రచ్చ చేస్తూ ఉంటారు . రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో సునీల్ నటన అక్కడి బ్యాచ్ కి తెగ నచ్చేసింది అని చెప్పుకోవాలి .
అంతేకాదు వరుసగా అక్కడ అవకాశాలు అందుకుంటూ అక్కడి వారిని కూడా మడత పెట్టేస్తున్నారు సునీల్.ఇకపోతే వినాయక చవితికి రిలీజ్ కాబోతున్న మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా సునీల్ పాత్ర మామూలుగా ఉండదని కోలీవుడ్లో వినిపిస్తోంది. కార్తీ జపాన్ లో కూడా సునీల్ కి మంచి పాత్ర లభించిందట. ఇవే కాకుండా ఈగై, బుల్లెట్ అనే మరో రెండు సినిమాలలో ఆయన కీలకపాత్రలో చేస్తున్నారు. మొత్తానికైతే తమిళ సినిమాలలో భారీగా పాపులారిటీ దక్కించుకున్నారు సునీల్.