Bigg Boss 6 Telugu: హౌస్ లో బిగ్ బాస్ ని మెప్పించడానికి కంటెస్టెంట్స్ వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఇనయ మాత్రం చాలా తెలివిగా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోంది. మొదటి రెండు వారాలు కాస్త కామ్ గా ఉన్న ఇనయ తనని ఎవరు పట్టించుకోవడం లేదు అవాయిడ్ చేస్తున్నారంటూ టైంపాస్ చేసింది.
మూడో వారం తర్వాత నుండి గేమ్ లో భాగంగా ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటూ ఇనయ అందరి అటెన్షన్ తనపైకి తప్పుకోవడంలో సక్సెస్ అయినట్లు కనిపించింది. ముఖ్యంగా శ్రీహాన్ తో పిట్టకథ యవ్వారం దాదాపుగా మూడు వారాల పాటు సాగింది. ఏకంగా హోస్ట్ నాగార్జున వీరిద్దరి పంచాయతీకి పెద్ద మనిషిగా వ్యవహరించి గొడవను సద్దుమణిగించాడు.
![Bigg Boss 6 Telugu: ఇనయ హౌస్ లో కావాలనే అలా చేస్తోందా..? 2 Inaya-Sulthana-bigboss-6](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/Inaya-Sulthana-bigboss-6.jpg)
అక్కడితో ఆ వ్యవహారానికి అందరూ ఎండ్ పడింది అని అనుకంటారు. కానీ ఓ వైపు కొత్తగా సూర్యతో క్రష్ స్టార్ట్ చేసి తనతో టైంపాస్ చేస్తూనే మరోవైపు శ్రీహాన్ తో ఏదో ఓ రకంగా వివాదం కొనసాగిస్తూనే వచ్చింది. దీంతో లాస్ట్ వీక్ బిగ్ బాస్ ఊహించని విధంగా ఇనయ ప్రదర్శన బాగాలేదని నాగార్జున్ క్లాస్ పీకుతాడు. గేమ్ మీద కాకుండా మనుషుల మీద ఫోకస్ పెరిగిందని వెటకరంగా ఇనయకు చెప్తాడు. దీంతో వచ్చే వారం అలా అనిపించుకోను అని ఇనయ నాగ్ కు చెప్తుంది.సీన్ కట్ చేస్తే తన క్రష్ సూర్యతో కనెక్షన్ ని తగ్గించుకుంటూ మరో గేమ్ స్టార్ట్ చేసింది. అనవసరంగా చమికిల విషయంలో శ్రీహాన్ ని ఈ వారం నామినేట్ చేస్తుంది.
పైగా అనవసరంగా నిన్ను నామినేట్ చేశాను ఈ హౌస్ లో అందరి కంటే మీరు కాస్త బెటర్ అని శ్రీహాన్ కి కాంప్లిమెంట్ ఇవ్వడం.. శ్రీహాన్ పుట్టినరోజు వేడుకల్లో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడం వంటివి చేస్తోంది ఇనయ. దీంతో హౌస్ లో తాను కావాలనే సేఫ్ గేమ్ తో ఇలా ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా ఇనయ మారుతూ వస్తోందని అందరికీ స్పష్టంగా అర్ధం అవుతోంది. మరోవైపు ఇన్ డైరెక్ట్ గా సూర్యతో కూడా కనెక్ట్ అవుతూనే వస్తోంది. కానీ శ్రీహాన్ తో కూడా కనెక్ట్ అయినట్లు హౌస్ సభ్యులను నమ్మించే పనిలో ఇనయ పడినట్లు కనిపిస్తోంది. మరి ఈ వ్యహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి..!