NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో దీనిమీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం కొరటాల చాలా టైమ్ తీసుకున్నారు.
దీనికి కారణం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ లాంటి స్టార్ తనపై నమ్మకంతో మరొకరితో కమిట్ కాకుండా ఏడాది పాటు వెయిట్ చేయడమే. ఈ నేపధ్యంలోనే తారక్ కూడా చాలా సార్లు స్క్రిప్ట్ డిస్కసన్ లో కూర్చున్నట్లు తెలుస్తుంది. మరింత బెటర్మెంట్ కోసం చాలా ఎక్కువ రోజులు వర్క్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మార్చి 20 తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని తారక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ క్యాస్టింగ్ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ వినిపిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతుంది. అలాగే సినిమాలో లోకేషన్స్ కూడా ఫిక్షనల్ అని తెలుస్తుంది. మూవీ కోసం ప్రత్యేకంగా ఒక పోర్ట్ ని అలాగే ఒక ద్వీపాన్ని సృష్టిస్తున్నారు. సముద్రం మధ్యలో ఉండే ఒక ఫిక్షనల్ ద్వీపంలో ఈ సినిమా కథాంశం మొత్తం నడుస్తుంది అని టాక్. ఈ నేపధ్యంలో కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోడార్క్ షేడ్స్ లో మూవీ కథాంశం నడుస్తుంది. దానికి తగ్గట్లుగానే తారక్ కోసం పవర్ ఫుల్ విలన్ ని ఎంపిక చేసే పనిలో కొరటాల ఉన్నారు.
ఈ నేపధ్యంలో కోలీవుడ్ నుంచి చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతిలో ఒకరిని విలన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. విక్రమ్ ఈ మూవీలో ప్రతినాయకుడుగా నటిస్తే సినిమా మరో రేంజ్ కి వెళ్తుంది అని భావిస్తున్నారు. అలాగే మరో పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సైఫ్ ఆలీఖాన్ ని కూడా సంప్రదిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్న స్టార్ క్యాస్టింగ్ లో ఎవరు ఫైనల్ అయినా కూడా సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది అని చెప్పొచ్చు.