Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో అనసూయను తులసి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా నందు ఇంట్లోకి రావద్దు అని అనసూయపై ఫైర్ అవుతాడు. నాన్న జోలికి వెళ్లొద్దు అని చెప్పినా కూడా వినలేదు అని ఆయన వస్తేనే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటాడు. అంతేకాకుండా తులసి పై కూడా ఫైర్ అవుతాడు.
దాంతో అనసూయ తను నన్ను దిగబెట్టడానికి వచ్చింది అనడంతో ఆయన తనకు అవసరం లేదు అడగవలసినవి నిన్ను అడగాలి అని అంటాడు. నాన్న ఎక్కడ అని అడగడంతో ఆయన కోపంతో రాలేదు అని తులసి అంటుంది. దాంతో నందు ఎలా వస్తారు ఆయన పరువు పాతాళంలో కూరుకుపోయేలా చేశారు కదా.. ఈ పని ఎవరైనా చేస్తే అక్కడే చంపేవాడిని కానీ చేసింది నా తల్లి కదా అంటాడు.
అంతేకాకుండా కోపంతో మరికొన్ని మాటలు అంటుంటాడు. తన తల్లిపై బాగా ఫైర్ అవుతుంటాడు.నాన్న లేకుంటే ఉండలేను అని ఎమోషనల్ అవుతాడు. తులసి ఏదో చెప్పబోతుండగా తనపై మరింత కోపం ప్రదర్శిస్తాడు. ఇక మరోవైపు పరంధామయ్య పరిస్థితి చూసి సామ్రాట్ వాళ్లు బాధపడతారు.
ఆయన కోపంలో అర్థం ఉంది కానీ ఆయన కోపం అనసూయ మనసును ముక్కలు చేసింది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. అందుకే తులసి తనని ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్లారు అని అంటాడు సామ్రాట్. తులసిని అనసూయ ఎంత బాధ పెట్టినా కూడా తులసి అవన్నీ పట్టించుకోకుండా తనని ఇంటికి తీసుకెళ్ళింది అది వ్యక్తిత్వమని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్.
అలా వాళ్లు కాసేపు తులసి గొప్పదనం గురించి మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఆమె బాధ్యతలు మనం కూడా పంచుకుందాం అని అంటారు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. ఇక్కడ మాత్రం తులసి కూడా నందుతో గట్టిగా మాట్లాడుతుంది. అత్తయ్య మామయ్యని నిందించినట్లు మీరు నిందించకండి అని అంటాడు.
తులసి ఇంటికి రాకపోయేసరికి అక్కడ ఏం జరిగిందో అని కంగారు పడతాడు సామ్రాట్. అదే సమయంలో ప్రేమ్ జరిగిన విషయం చెప్పటంతో మరింత కంగారు పడతారు. ఇక తులసి మాత్రం బయట మాట్లాడుకుంటే అందరూ వింటారు పరువు పోతుంది అని అనటంతో పరువు పోయిన సరే నేను ఇలాగే మాట్లాడుతాను అని అంటాడు. తులసి మాత్రం ఆవేశపడకండి అంటూ మాట్లాడుతుంది.
మీ నాన్న నా దగ్గరనే ఉన్నారు అనిమా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థాంక్స్ అని అంటాడు నందు. ఇక ఆయన కుదురుకున్నాక తీసుకొని వస్తాను అంటాడు. దాంతో లాస్య కలుగజేసుకొని మరింత నిప్పు పెట్టే ప్రయత్నం చూస్తుంది. మామయ్యను తన గుప్పెట్లో పెట్టుకొని గొడవలను సృష్టిస్తుంది అని అంటుంది.దీంతో తులసి, లాస్య మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
తులసి నన్ను మామయ్య గారు కూతురిలా అనుకుంటున్నారు అనడంతో నన్ను మాత్రం అలా అనుకోవడం లేదు అంటుంది లాస్య. దాంతో నందు అవును ఇన్ని సంవత్సరాలైనా నాన్న చేత నువ్వు కూతురు అనిపించుకోలేదు నీదే తప్పు అని అంటాడు. దాంతో లాస్య షాక్ అవుతుంది.
Intinti Gruhalakshmi:
తిరిగి తనపైనే బాణం పడింది అని అనుకుంటుంది. కూడా తులసి పై మరింత నిప్పు చల్లుతూ ఉంటుంది. ఇక నందు కూడా తులసి పై అరుస్తాడు. పరంధామయ్య ఏ విషయంలో బాధపడుతున్నాడో కూడా వాళ్లకు వివరించి చెబుతుంది తులసి.