Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఫోన్ మాట్లాడుకుంటూ తులసిని గమనించని సామ్రాట్ అటువైపుగా జనాలు పరుగెత్తడం చూసి ఏమైందని ప్రశ్నించగా అందుకు నీటిలో ఒక ఆమె కొట్టుకపోయిందని చెప్తారు.
అప్పుడు సామ్రాట్ చాలా కంగారుగా తులసి తులసి అని గట్టిగా అరచి వెతికి కంగారు పడుతుండగా అంతలోనే తులసి అక్కడికి వస్తుంది మీరు ఎక్కడికి వెళ్లారు చెప్పి వెళ్లాలి కదా సెన్స్ లేదా అని తులసి పై కోప్పడతాడు సామ్రాట్ అందుకు తులసి మీరే కదా అటువైపు వెళ్ళద్దు అన్నారు అందుకే నేను అటువైపు కాకుండా మొక్కజొన్న కుంకుల కోసం వెళ్లాను అంటే మీ మీద నాకు బాధ్యత ఉంది కదా మీకేమన్నా అయితే నేనెవరికీ సమాధానం చెప్పాలి మీరే అనుకొని చాలా కంగారు పడ్డాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.తులసి సామ్రాట్ దగ్గరకు వెళ్లి సారీ నేను ఏం చిన్నపిల్లను కాదు మీరు చెప్పింది గుర్తుంది కదా అందుకే నేను అటువైపు వెళ్ళలేదు ఇంతసేపు ఆడుకున్నాను కదా మొక్కజొన్న కంకులు తినాలి అని అనిపించింది మీకు చెప్పి వెళదామంటే మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు. సారీ చెప్పకుండా వెళ్ళినందుకు సరే తీసుకొని మొక్కజొన్న కంకులను వేడి చల్లారితే బాగుండదు కావాలంటే రూమ్ కెళ్ళి కొట్టొచ్చు అంటే దానికి నవ్వుతాడు.
తర్వాత సన్నివేశంలో అంకిత శృతి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సూపర్వైజర్ ఫోన్ చేసి వెంటనే బయలుదేరి ఆదిలాబాద్ రావాలని సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఈరోజు కొంచెం కష్టం సార్ ఎల్లుండి అయితే వస్తాను అంటుంది. దానికి తప్పదు ఈరోజు రావాలి అంటే సరే వెంటనే బయలుదేరుతాను అంటుంది. అది విన్న అభి అంకిత ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే ఆదిలాబాద్ వెళ్తున్నాను బయట సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అంటే దానికి అభి మామ్ కూడా ఇంట్లో లేదు నువ్వు కూడా వెళ్తే ఎలా అంటే ఆంటీ రేపు వచ్చేస్తారు కదా అవి నేను వెంటనే వెళ్లాలి అంటుంది.
తర్వాత సన్నివేశంలో సామ్రాట్ ,తులసి ల వద్దకు నందు ఇంకా లాస్య వస్తారు. లాస్య నందుతో నేను బెట్ గెలిచాను కదా పదివేలు ఇవ్వు అంటే దానికి ఏంటి అని ప్రశ్నించగా దానికి లాస్య ఏమీ లేదు సార్ మేము మొగుడు పెళ్ళాం కదా రూమ్ లో కూర్చుంటే బోర్ గా ఉంటుందని బీచ్ కి వెళ్ళాలి అనుకున్నాము. ఇద్దరమే వెళితే ఏం బాగుంటుంది మిమ్మల్ని మేడంని కూడా తీసుకువెళ్దాం అంటే అందుకున్నందు సామ్రాట్ గారు వర్క్ మైండేడ్ ఆయన ఇలా బీచ్లు అవి ఇవి అని టైం వేస్ట్ చేసుకోరు అంటాడు. ఎలాగైనా బ్రతిమలాడి ఒప్పించి తీసుకువెళ్దామని మీ రూమ్ దగ్గరికి వస్తే మీ రూమ్ లో లాక్ చేసి ఉన్నాయి. నేను గెలిచినట్టే కదా అంటూ తన బ్యాగ్ లో నుంచి తీసి మల్లెపూలు తీసుకోమంటుంది .తులసికి నాకు మల్లెపూలు ఇష్టం ఉండవు .అంటే మీకోసం కాదు మీ పక్కన నడిచేవారికి ప్రజెంట్ గా ఉంటుంది అని నందు అంటే తీసుకున్నాను. అంటూ పూలను తులసి కి పెడుతుంది. తులసి రూమ్ కి వెళ్దాం పదండి అంటే దానికి అదేంటి తులసి గారు అప్పుడేనా అంటారు సామ్రాట్. లాస్య కలగజేసుకొని సార్ బీచ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేశారంటే నాదేముంది అంతా తులసి గారిదే అంటాడు. అప్పుడు లాస్య అవునా అంటే తులసి అవును ఇంతకుముందు మొహమాటంతో ఉండేదాన్ని ఇప్పుడు అలాంటిదేమీ లేదు ధైర్యంగా ఏమైనా ఎదుర్కొంటాను లాస్య అంటుంది. అప్పుడు సామ్రాట్ మీరు కూడా తులసి గారిని ఫాలో అవుతున్నారా అని లాస్య ను అడుగుతాడు. తులసి లాస్యతో నువ్వు నా అభిమానివి కదా నీకు తెలియాలనే చెప్తున్నాను అంటే సామ్రాట్ మంచి గుడ్ డెసిషన్ అంటాడు. తరువాత తులసి ఇంకా సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు డైరెక్ట్ గా తులసిని అటాక్ చేస్తున్నావు లాస్య అని నందు ప్రశ్నించగా ఎవరైనా డైరెక్ట్ గా అటాక్ చేస్తేనే ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతారు నువ్వేం కంగారు పడకు అంటుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది.
తరువాత సన్నివేశంలో దిగులుగా బాధపడుతూ కూర్చున్న శృతి వద్దకు వాళ్ళ కౌసల్య అత్త వచ్చి తప్పు చేశావమ్మా నువ్వు ప్రేమతో అలా మాట్లాడి ఉండకూడదు అంటే దానికి శృతి నేనేం తప్పు చేశానో అత్తయ్య అంటే నేను తప్పు ఒప్పుల గురించి మాట్లాడడం లేదు భార్యాభర్తల బంధం గురించి చెప్తున్నాను తనను ప్రేమతో నీ దారిలోకి తెచ్చుకుంటావు అనుకున్నాను కానీ అతని ఈగోపై కొడతావు అనుకోలేదు. ప్రేమని వాళ్ళ నాన్నతో పోల్చావు ప్రేమకు వాళ్ళ నాన్న అంటే చచ్చేంత కోపం అని తెలుసు కదా. అప్పుడు శృతి ప్రేమ్ ప్రవర్తన ఏమి బాగోలేదు అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అమ్మ అర్థం చేసుకోవాలి నువ్వు అంటే దానికి శృతి ,ప్రేమ్ నీపై కోప్పడ్డాడు అదేమి చిన్న విషయం కాదు అంటే పర్లేదు అమ్మ నా గురించి ఏముంది అంటే అది నాకు చాలా పెద్ద విషయం నేను చిన్నగా తీసుకోలేను అంటుంది శృతి. నేను మనసు చంపుకొని వేరే ఇంట్లో పనిమనిషిగా చేస్తూ ప్రేమకు సపోర్టుగా ఉన్నాను మీ ఉద్యోగం నీదే నాకు సంబంధం లేదు అని గిరగించుకొని కూర్చుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ మాత్రం తెలియదా. ఇప్పుడు కూడా తాను నాపై ప్రేమతో వచ్చి ఉంటే సంతోషంగా అతని వేలు పట్టుకొని వెళ్ళేదాన్ని. అంకిత బుద్ధి చెప్పిందని తన మనసు మార్చుకుని వచ్చాడు. ఇలాంటి వాటిని నమ్మి ఆ ఇంటికి వెళ్లడం సవ్యంగా కాపురం జరగడం నిజమేనంటావా అత్తయ్య మళ్లీ ఇలాగే ప్రవర్తించడని ఎలా నమ్మాలి అంటే దానికి తప్పమ్మ శృతి నమ్మాలి ఇది భార్యాభర్తల సంబంధం అలా కాదు గాని నేను ఒకసారి వెళ్లి ప్రేమ్ నువ్వు కలిసి వస్తాను అంటే శృతి ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు. నమ్మకం కుదిరి వరకు నేను అతనితో కాపురం చేయను. ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ల మధ్య అవగాహన పెంచి ఒక్కటి చేద్దాం అనుకుంటే దూరం మరింత పెరిగింది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంటుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశం రెస్టారెంట్ లో తులసి ఇంకా సామ్రాట్ కూర్చొని నవ్వుకుంటూ దేవుడు చాలా మంచి పని చేశాడు. ఫ్లైట్ డిలే పోస్ట్ పోవడం ద్వారా మీరు మీ చిన్నప్పటి కలలను నేర్చుకోగలిగారు అంటాడు సామ్రాట్. తర్వాత చెయ్యి కడుక్కొని వస్తానని అక్కడినుంచి వెళ్తున్న సామ్రాట్ ఇంతలో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.