intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో.. సామ్రాట్ కారు ట్రబుల్ ఇవ్వటంతో తులసి, సామ్రాట్ ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. వారికి ఐస్ క్రీమ్ కనిపించడంతో సామ్రాట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అని అరగడంతో అమ్మే వ్యక్తి ఐస్ క్రీమ్ లా ఉంటుంది అంటే కౌంటర్ వేస్తాడు. దాంతో తులసి నవ్వుకుంటుంది. ఇద్దరు కుల్ఫీ తీసుకొని తింటుండగా డబ్బులు కట్టడానికి తన చేతిలో ఉన్న సగం కుల్ఫీని తులసికి పట్టుకోమని ఇస్తాడు సామ్రాట్.
ఇక చూసేసరికి పర్సు లేకపోవటంతో కంగారు పడతాడు. తులసి కూడా అయ్యో నేను కూడా పరిస్థితి లేదు అని అంటుంది. వెంటనే కార్ దగ్గరికి వెళ్లి తెస్తాను అని అంటాడు సామ్రాట్. ఇక తులసి కాస్త ఆగండి అంటూ ముందు ఐస్ క్రీమ్ తినండి అంటూ మాట్లాడుతుంది. ఇక తాము చిన్నవయసులో చేసిన అల్లర్ల గురించి చెబుతుంది. అంతేకాకుండా ఐస్ క్రీమ్ వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన విషయం చెబుతుంది.
ఇప్పుడు ఆ పని చేయాలి అని అంటుంది తులసి. సామ్రాట్ వద్దు అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. వాని తులసి మాత్రం ఏం కాదు అతడు చూడకు ముందే పారిపోదాం అని ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి సామ్రాట్ ను పరిగెత్తిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ వెనక్కి వెళ్లి డబ్బులు ఇద్దాం అనటంతో తులసి వద్దు ఇచ్చేసాను అంటూ జరిగిన విషయం చెబుతుంది. దాంతో తులసి తనను మోసం చేసి పరుగులు పెట్టించింది అని నవ్వుతాడు సామ్రాట్.
ఇక ఇంటి దగ్గర పరంధామయ్య జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అనసూయ వచ్చి క్షమించమని బ్రతిమాలితో ఉంటుంది. పరంధామయ్య మాత్రం ఏమి అనలేకపోతాడు. దాంతో అనసూయ కనీసం నన్ను శిక్షించండి అంటూ అని ఇలా ఉండకూడదు అని అంటుంది. ఇక పరంధామయ్య దేవుడి నీకు శిక్ష విధించాడు మంచి కోడల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించావు ఇప్పుడు లాస్య పెత్తనం చేస్తుంది అదే నీకు శిక్ష అని అంటాడు.
పరంధామయ్య ఇంట్లోకి వెళుతూ ఉండగా అనసూయ పిలుస్తూ పిలుస్తూ స్పృహ కోల్పోతుంది. ఇక ఈ విషయం తులసికి తెలియడంతో వెంటనే తులసి ఇంటికి వస్తుంది. ఇక అనసూయకు అభి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. 24 గంటల్లో అబ్జర్వేషన్ లో ఉంచాలి అని అంటాడు. తులసి రాగానే అనసూయ స్పృహలో నుండి బయటకి వస్తుంది.
intinti Gruhalakshmi:
నీతో మాట్లాడాలి అని తులసి తో అంటూ లాస్య ను బయటికి వెళ్లిపోమని అంటుంది. దాంతో లాస్య నేను ఈ ఇంటి కుటుంబ సభ్యురాలిని అంటూ నన్ను కాకుండా బయట వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్పి నన్ను ఎలా పంపిస్తున్నావు అని అరుస్తుంది. ఇక నందు కూడా తన తల్లికి సపోర్ట్ చేస్తూ లాస్యను బయటికి పంపిస్తాడు. తర్వాత అనసూయ తను చేసిన తప్పులకు అందరికీ క్షమాపణలు చెబుతుంది.