ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.పెద్దగా ఏ మధ్య అవకాశాలు లేక ప్రస్తుతం మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుంది ఈ బ్యూటీ .కానీ సోషమీడియాలో తెగ హలచల్ చేస్తుంది. దానికి కారణం పెళ్లి కాకుండానే ,భర్త ఎవరో చెప్పకుండానే తల్లి అవుతుంది ఈ ముద్దుగుమ్మ.ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ని చూపిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
![ఇలియానా బిడ్డకి తండ్రి అతడేనా? బాయ్‌ఫ్రెండ్ ఫొటో షేర్ చేసిన ఇలియానా.. 2 ఇలియానా బిడ్డకి తండ్రి అతడేనా? బాయ్‌ఫ్రెండ్ ఫొటో షేర్ చేసిన ఇలియానా..](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-03T145952.400.jpg)
కానీ ఆ బేబీకి తండ్రి ఎవరు అనేది చెప్పకుండా దాచింది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రియుడి ఫోటోని షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో అతను ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. ఆ ఫొటోలో అతను శునకంతో ఆడుకుంటు తన ముఖం కనిపించకుండా కిందికి దించేశాడు.
దీంతో అతడెవరన్నది చర్చనీయాంశమైంది.దానికి ‘పప్పీ లవ్’ అని క్యాప్షన్ తగిలించింది.కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ అందులో శునకాన్ని కిస్ చేస్తూ కనిపించాడు. దీంతో ఇలియానా తన ప్రియుడిని పరిచయడం చేయడంలో ఎప్పటికప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేసిందిఇదిలా ఉంటే.. గతంలో ఇలియానా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలపై వీరిద్దరు స్పందించలేదు.