Katrina Kaif : బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ఒకరు. అమ్మడు తన నటన, అందంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. ఈ బ్యూటీ గతేడాది డిసెంబర్లో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్‌ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నుంచి మొదలు పలువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు.. వాళ్లందరిని కాదని విక్కీ విశాల్‌ను పెళ్లాడింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి అప్పట్లో బాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్ అని చెప్పాలి. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబర్ 9న ఆ రోజు సాయంత్రం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
తాజాగా ఈ జంట గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా ఈ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కత్రినా ముంబైలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కత్రినా కైఫ్ వైట్ టీషర్ట్, ఆరెంజ్ కలర్ ప్యాంట్ ధరించి చాలా స్టైలిష్‌గా ఉంది. అయితే ఈ వీడియోలో కత్రినా కొంచెం లావైనట్లుగా కనిపిస్తోంది. అమ్మడు సినిమాల్లోకి వచ్చిన నాటి నుంచి మాంచి ఫిజిక్‌ను మెయిన్టైన్ చేస్తూ వస్తోంది. ఎప్పుడూ చాలా స్లిమ్‌గా ముద్దుగుమ్మలా కనిపించే కత్రినా ొక్కసారిగా కాస్త బొద్దుగుమ్మలా కనిపించింది.
Katrina Kaif : అది నిజమైతే బావుండు..
గత కొన్నేళ్లుగా కూడా కత్రినా బరువు పెరగకుండా ఎక్సర్సైజ్లు చేస్తూ ఫిజిక్‌ని మెయిన్టైన్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా కాస్త లావుగా కనిపించేసరికి అమ్మడు అలా కనిపించడానికి కారణం ప్రెగ్నెంట్‌గా ఉండటమేనన్న చర్చ నెట్టింట మొదలైంది. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆమె గర్భవతిలా కనిపిస్తోంది. అది నిజమైతే చాలా బావుండు’ అంటూ కొందరు.. ‘త్వరలో క్యాట్ శుభవార్త చెప్పబోతోంది. ఆమె గర్భవతిలా కనిపిస్తోంది’ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అమ్మడు నిజంగా ప్రెగ్నెంటో కాదో తెలియదు కానీ రచ్చ మాత్రం ఓ రేంజ్‌లోనే జరుగుతోంది.