మూడో పెళ్లీ పెటాకులేనా? పవన్ విడాకుల వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన మూడో భార్య ఎనా లెజ్నోవాతో పవన్ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మూడో భార్యతోనూ విడిపోయాడా? అతని భార్య ఎనా లెజ్నోవా పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందా? ప్రస్తుతం ఇలా వివిధ సైట్లలో వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ మూడో పెళ్లి కూడా పెటాకులైనట్లు కొంతకాలంగా గ్రేట్ ఆంధ్రాలాంటి వెబ్ సైట్లు వార్తలు ప్రచురిస్తున్నాయి.
![మూడో పెళ్లీ పెటాకులేనా.. పవన్ విడాకుల వార్తలు వైరల్ 2 మూడో పెళ్లీ పెటాకులేనా.. పవన్ విడాకుల వార్తలు వైరల్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-03T124118.888-1.jpg)
ఇందులో నిజమెంత అన్నది తెలియలేదు. అటు పవన్ గానీ, లెజ్నోవా గానీ దీనిపై నోరు విప్పలేదు. ఈ ఇద్దరు భార్యాభర్తలు లీగల్ గా విడిపోకపోయినా.. సామాజికంగా మాత్రం కలిసి ఉండటం లేదని కూడా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీలో తరచూ ఈవెంట్స్ జరుగుతున్నా.. దేనికీ లెజ్నోవా హాజరు కాలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఏపీలో వారాహి యాత్ర కూడా చేస్తున్నాడు. ఈ మధ్య వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కు పవన్ ఒంటరిగానే వచ్చాడు. అటు రాష్ట్రం చల్లగా ఉండాలంటూ తాను చేసిన యాగంలోనూ పవన్ ఒక్కడే కూర్చోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి యాగాలు దంపతులు ఇద్దరూ కలిసి చేస్తుంటారని గుసగుసలు వినిపించాయి.
2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో ఎనా లెజ్నోవాతో పవన్ కు పరిచయం ఏర్పడింది. ఆమె ఒక రష్యన్ మోడల్, నటి. ఆమెతో ప్రేమలో పడిన పవన్.. 2013, సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే లెజ్నోవాకు ఓ కూతురు ఉండగా.. పవన్ తో 2017లో ఆమె మరో కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరు పెట్టడం విశేషం.