ఇప్పుడు ఉన్న మధ్యకాలంలో జబర్దస్త్ షో అందరికి బాగా తెలిసిందే దాంట్లో బాగా పాపులారిటీ దక్కించుకున్న కమిడియన్లు ఏదో ఒక విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది . ఇప్పటికే హైపర్ ఆదిని మొదలుకొని చాలామంది కమెడియన్లు సినిమా సెలబ్రిటీలనే కాకుండా రాజకీయ నాయకులను కూడా విమర్శిస్తూ ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ కి కూడా వైసిపి పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది.
![జబర్దస్త్ ఇమ్మానుయేల్ కు వైసీపీ వాళ్ళ నుండి బెదిరింపు..! 2 జబర్దస్త్ ఇమ్మానుయేల్ కు వైసీపీ వాళ్ళ నుండి బెదిరింపు..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-05T110956.585.jpg)
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ ద్వారా హీరోగా ఎరపైకి రాబోతున్నారు . ఇందులో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుండగా అతడు ఆ గ్రామంలో ఉండే ఒక అమ్మాయిని ప్రేమలో పడేసి ప్రేమ వాలంటీర్ గా మారిపోతాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదల చేయగా ఈ ట్రైలర్ చూసిన వైసిపి అధినేతలు ఇమ్మానుయెల్ ను హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే గ్రామ వాలంటీర్ల మీద పవర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి ఇలాంటి సమయంలోనే వాలంటీర్ మీదే వెబ్ సిరీస్ తీయడం అనేది పెద్ద రిస్కే.. అందుకే ఇమ్మానుయెల్ ను వారు హెచ్చరిస్తున్నారు . తేడా వస్తే నీ పని చెప్తా అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్లు కూడా వస్తున్నాయి . మరొకవైపు ఇమ్మానుయేల్ అభిమానులు మాత్రం హీరోగా మొదటి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు అని చెబుతున్నారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని ఇమ్మానుయేల్ తో పాటు రచన ,దర్శకత్వం వహిస్తున్న బాబుకి కూడా మంచి పేరు రావాలని కామెంట్లు కూడా వస్తున్నాయి . మరి ఈ వెబ్ సిరీస్ ఎటువంటి వివాదం జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.