నర్సపెల్లే అంటూ చిరు మాస్ స్టెప్పులు వేశాడు. భోళా శంకర్ మూవీ నుంచి జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట మధ్యలో సూపర్ హిట్ కనకవ్వ పాట నర్సపెల్లేపై కూడా చిరు డ్యాన్స్ చేయడం విశేషం.మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న మూవీ భోళాశంకర్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు.
![జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్.. చిరు మాస్ స్టెప్పులు 2 జామ్ జామ్ జజ్జనక సాంగ్ రిలీజ్.. చిరు మాస్ స్టెప్పులు](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/B.jpg)
డప్పేస్కో.. దరువేస్కో.. వవ్వారే అదిరే పాటేస్కో అంటూ ఈ సాంగ్ మొదలువుతుంది. ఈలేస్కో.. ఇగ జూస్కో.. ఇయ్యాల డ్యాన్సూ ఇరగేస్కో అంటూ చిరంజీవి పాటలోకి ఎంట్రీ ఇస్తాడు. జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లూ ఆడదాం తైతక్కా అంటూ ఈ పాట సాగిపోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు భోళాశంకర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది ఓ పార్టీ సాంగ్. ఈసాంగ్ లో మెగాస్టార్ తో పాటు అక్కినేని హీరో సుశాంత్ హీరోయిన్లు తమన్నా , కీర్తిసురేష్ కూడా కనిపించారు.
ఈ భోళా శంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెప్పీ నంబర్ కచ్చితంగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.