Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్డ్ కథలని ఎంపిక చేసుకుంటూ ముందుగా నటిగా ప్రూవ్ చేసుకునే పనిలో జాన్వీ కపూర్ పడింది.
దానికి తగ్గట్లుగానే ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేసింది. నెపోటిజం కిడ్ అని విమర్శించిన వారే ఇప్పుడు ఆమె నటనని మెచ్చుకుంటూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే సినిమాలలో ఈ బ్యూటీ ఎంత పద్ధతిగా కనిపిస్తుందో బయట అంత అల్ట్రా మోడరన్ బ్యూటీగా మెరిసిపోతూ ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే.
గ్లామర్ షో చేయడానికి జాన్వీ కపూర్ ఏ మాత్రం వెనకడుగు వేయదు. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతూ ఉంటుంది. అందుకే జాన్వీ అందానికి ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఈ బ్యూటీ ఒక్కహాట్ ఫోటో పెట్టింది అంటే తక్కువలో తక్కువ పది లక్షల వరకు లైక్స్ వస్తూ ఉంటాయి. అంతగా జాన్వీ కపూర్ అందాన్ని ఆశ్వాదిస్తూ ఉంటారు.
ఈ నేపధ్యంలో జాన్వీ కపూర్ కి సోషల్ మీడియాలో గ్లామర్ షో ద్వారా ఆదాయం కూడా లక్షల్లోనే వస్తుంది అని చెప్పాలి. బాలీవుడ్ భామలకి ఇన్స్టాగ్రామ్ ఒక సైడ్ ఇన్ కమ్ లాంటిది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి జాన్వీ కపూర్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
రెడ్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో ఈ అమ్మడు ఎద అందాలని ఆరబోస్తూ గ్లామర్ షో చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ లో అప్పుడే సముద్రం నుంచి బయటకి వచ్చిన సాగరకన్యలా జాన్వీ కపూర్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు తారకరత్నకి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది.