Janhvi Kapoor : అతిలోక సుందరి పెద్ద కూతురు జాన్వీకపూర్ పై సోషల్ మీడియాలో ఒక్కో రోజు ఒక్కో రూమర్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. నిన్నమొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిందని, టాలీవుడ్‌లోకి త్వరలో ఎంట్రీ ఇచ్చేస్తుందని తెగ రూమర్స్ వచ్చాయి ఇప్పుడేమో తమిళ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

దీంతో తన కూతురు జాన్వీ తమిళ సినిమాలో నటించడం క్లారిటీ ఇస్తూ పుకార్లకు స్వస్తి పలికారు తండ్రి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జాన్వీ తమిళ ఇండస్ట్రీ ఎంట్రీకి సంబంధించి తప్పుడు పుకార్లు ప్రచారం చేయవద్దని మీడినాను అభ్యర్థించారు.

జాన్వీ కపూర్ చివరిసారిగా సర్వైవల్ థ్రిల్లర్ మిలిలో కనిపించింది. ఆ తరువాత పెద్దగా ఏ సినిమాలను సైన్ చేయలేదు జాన్వీ. అయితే లింగస్వామి దర్శకత్వం వహిస్తున్న పయ్యా 2 లో ఆర్య సరసన నటించేందుకు జాన్వీని మూమీ టీం సంప్రదిచినట్లు ఈమధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అమ్మడి తమిళ ఎంట్రీకి సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయంపై బోనీకపూర్ స్పందిస్తూ, డియర్ మిత్రులారా, ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎలాంటి తమిళ సినిమాలకు కమిట్ కాలేదని, తప్పుడు పుకార్లకు స్వస్తి పలకాలని బోనీకపూర్ తెలిపారు.

గతంలో ఓ షోలో తెలుగులో జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలతో నటించాలని ఉందని జాన్వీ తెలిపింది. ఇలా చాలా మంది సౌత్ స్టార్స్ తో నటించాలని ఉందని పేర్కొంది. అక్కడి హీరోలు టాలెంటెడ్ అని, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పెద్ద సినిమాలు వస్తున్నాయని తెలిపింది. జెనీలియా, సిద్దార్ధ్ నటించిన బొమ్మరిల్లు సినిమా తన ఫేవరేట్ మూవీ అని కూడా తెలిపింది. ఇక పోకిరి, జనతా గ్యారేజ్ సినిమా కూడా చాలా ఇష్టం అని చెప్పింది

.