Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంది. ఈ అమ్మడుకి మంచి అవకాశాలు వస్తున్నాయి. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఇక గ్లామర్ షో విషయంలో అందరిని మించిపోయింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జాన్వీ కపూర్ అందాల జాతర కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగులు పెట్టడానికి సిద్ధం అవుతుంది. జూనియర్ ఎన్టీఅర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తుంది.

తారక్ 30వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఏడాది పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై కొరటాల వర్క్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ మూవీకి మంచి హైప్ ఉంటుంది. ఈ నేపధ్యంలోనే జాన్వీ కపూర్ కూడా తనకి గ్రాండ్ గా టాలీవుడ్ లాంచింగ్ గా ఈ చిత్రాన్ని భావిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకి 3.4 కోట్ల మేరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. బాలీవుడ్ లో ఆమె సినిమా బడ్జెట్ మొత్తం చూసుకున్న ఆ స్థాయిలోనే ఉంటుంది. అలాంటిది ఎన్టీఆర్ చిత్రం కోసం ఈ రేంజ్ లో ఆమె చార్జ్ చేయడం నిజంగా సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లలో కేవలం రష్మిక, పూజా హెగ్డే మాత్రమే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అని చెప్పాలి.