అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి, రెండు సినిమాలతోనే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న జాన్వీ కపూర్ అందంలో కూడా తల్లిని గుర్తు చేస్తూ ఉంటుంది.
అతిలోక సుందరి కూతురు అంటే ఆ రేంజ్ ఉండాలి మరి అనే విధంగా ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రకారు గుండెలు పిండి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చగొడుతూ బాగానే పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇక ఈమె సౌత్ ఎంట్రీ కోసం శ్రీదేవి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూసిస్తున్నారు. కొరటాల శివ, ఎన్ఠీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఖరారు చేసుకున్నారు అనే ప్రచారం నడుస్తుంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా మరో సారి తన మతిపోగోట్టే అందాలని ఫాన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. చీరకట్టులో కూడా తన అందం ఏ మాత్రం తగ్గదని అనే విధంగా ఆమె ఫోటోలు కట్టిపడేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వెంటనే అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటుంది. ఇక పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోయే జనగణమన సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తుంది. అలాగే సౌత్ లో కూడా చాలా మంది దర్శక, నిర్మాతలు జాన్వీ కపూర్ ని పరిచయం చేయడం కోసం వేచి చూస్తున్నారు.