మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జిన్నా. ఈ మూవీని హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రదర్శించారు. మంచు విష్ణు తనకి బాగా అచ్చొచ్చే కామెడీ జోనర్ లోనే ఈ మూవీ చేయడంతో కచ్చితంగా హిట్ వస్తుందని గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే పాతబడిపోయిన కథని పట్టుకొని ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం అనుకోని జిన్నా ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేసిన మంచు విష్ణు ఖాతాలో మరో డిజాస్టర్ గా చేరిపోయింది. నిన్న ఒక్క రోజే నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అందులో కార్తీ సర్దార్ మూవీకి హిట్ టాక్ వచ్చింది. అలాగే విశ్వక్ సేన్ ఓరిదేవుడా సినిమా పర్వాలేదనిపించుకుంది. శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. జిన్నాకి మాత్రమే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ నాలుగు సినిమాలతో పోల్చుకుంటే జిన్నా చివరి స్థానంలో ప్రేక్షకాధారణ పరంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ మొత్తం సన్నీ లియోన్ క్యారెక్టర్ మీదనే నడుస్తుంది. బధిర యువతి పాత్రలో సన్నీ ఈ సినిమాలో మొదటి సారి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ చేసింది.
అయితే ఆమె ఆ పాత్రని అనుకున్న స్థాయిలో పండించలేకపోయింది. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడిందని టాక్. అలాగే పాయల్ రాజ్ పుత్ పాత్ర ఎప్పటిలాగే కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అయ్యింది. ఇక మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావుగా సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించే ప్రయత్నం చేసిన కథలో దమ్ము లేకపోవడంతో లాంగ్ రన్ లో కొనసాగడం కష్టం అనే మాట వినిపిస్తోంది. సన్నీ లియోన్ ని సక్సెస్ కోసం తెచ్చుకున్న మంచు విష్ణుకి ఆమె కూడా అదృష్టాన్ని ఇవ్వలేకపోయింది అనే మాట వినిపిస్తోంది.