కల్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా అతడు కనిపిస్తున్న భారత దేశం లో స్వాతంత్రం రాకముందు జరిగిన స్టోరీ ఇది .
నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ డెవిల్. బింబిసారతో సూపర్ డూపర్ హిట్ అందుకొని.. అమిగోస్ తో మరోసారి బోల్తా పడిన కల్యాణ్ రామ్.. ఇప్పుడు డెవిల్ గా అదిరిపోయే లుక్, నటనతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా బుధవారం (జులై 5) ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు
కల్యాణ్ రామ్ :
సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చాలా థ్రిల్లింగా ఉంది. మూవీ పేరుకు తగినట్లే కల్యాణ్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు. మనసులో ఉన్న భావన ముఖంపై కనపడకూడదు.. మెదడలోని ఆలోచన మాటల్లో బయటపడకూడదు.. అదే గూఢచారి లక్షణం అంటూ ఈ గ్లింప్స్ లో కల్యాణ్ చెప్పే డైలాగ్ బాగుంది. డెవిల్ మూవీలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త నటిస్తోంది.