ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ కన్నడ సినిమా మూవీ అవైటెడ్ మూవీగా మారిపోయింది. కన్నడ భాషలో కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మించారు. రిషబ్ శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించి హీరోగా నటించడం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే కన్నడ నాట ఏకంగా 75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ బాషలలో కూడా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, డార్లింగ్ ప్రభాస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి పాయింట్ ని ఏందో క్లియర్ గా ప్రెజెంట్ చేశారని, అలాగే చివరి 30 మినిట్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అంటూ కామెంట్స్ చేశారు. హీరో రానా దగ్గుబాటి కూడా కాంతారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరు ఈ మూవీని కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ఒక క్లాసిక్ గా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. సోషల్ మీడియాలో ఉన్న బజ్ కారణంగా కాంతారా తెలుగు రిలీజ్ పై కూడా హైప్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలని బీట్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఐఎండిబి మూవీ రేటింగ్స్ కి ఈ మూవీ ఏకంగా 8.2 యూజర్ రేటింగ్స్ కి సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 కి 8 పాయింట్స్ రేటింగ్స్ ఉండగా కాంతారా మూవీ దానిని బీట్ చేసింది. దీని తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలని బీట్ చేసి టాప్ లో నిలిచిన చిత్రంగా కాంతారా నిలిచింది. ఒక కన్నడ సినిమాకి ఈ రేంజ్ లో బజ్ రావడం అంటే అదంతా కేజీఎఫ్ తీసుకొచ్చిన చేంజ్ అని చెప్పాలి.