Kanthara: ఇప్పుడు దేశంలో ఎక్కడచూసిన ‘కాంతారా’ సినిమా గురించే చర్చ జరుగుతుంది. కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో భారీ హిట్గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు శైతం ఆశ్చర్యపోతున్నారు. దేవుడి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని చూసిన ఆడియన్స్ అయితే ఈ సినిమాలో విజువల్స్, టేకింగ్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ఈ మూవీని లో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిని భారతీయ సినీ ప్రముఖులు అందరూ ప్రశంసలతో ముంచెతుత్తున్నారు.
కన్నడ భాషలో తెరకెక్కిన ‘కాంతారా’ మూవీ కొన్ని రోజుల గ్యాప్లో తెలుగు హిందీ తమిళ్ మలయాళంలో రిలీజ్ అయింది. కన్నడలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది. అదేవిధంగా తెలుగు హిందీలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్ల దిశగా ముందుకెళుతోంది.
ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో రిలీజైన మొదటిరోజే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పటికే పెట్టిన దానికి పదింతలు డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా మౌత్ టాక్తో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. మొదటి వారంలో ఈ మూవీ 15కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కాగా ఈ గురువారం ఈ సినిమాకు రూ.1.9 కోట్ల లాభం వచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమా హిందీలో రూ. 15కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Kanthara
మరోవైపు దీపావళి వీకెండ్ హాలీడేస్ కూడా ‘కాంతారా’ మూవీకి కలిసి రానున్నాయి. శని ఆదివారాలు వసూళ్లు ప్రతీరోజు నాలుగు నుంచి కోట్ల ఏడు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీలో ఈ మూవీకి గత వారం రోజులుగా మంచి టాక్ వస్తుండటం దీపావళి సెలవులు సైతం కలిసి రానుండటంతో మరో 15 కోట్ల మేర కలెక్షన్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి దీపావళి సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంటుంది.