గత ఎపిసోడ్లో.. దుర్గ వల్ల ఇబ్బందిగా ఫీల్ అయిన మోనిత పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. దుర్గ మంచివాడేనని సర్టిఫికెట్ ఇచ్చి కాపాడతాడు కార్తీక్. దీప మీద ఎవరో దాడి చేశారని తిరిగి కంప్లైంట్ కూడా ఇస్తాడు. దాంతో.. విచారిస్తామని ఎస్సై హామీ ఇస్తాడు. అది చూసి కార్తీక్ మీద మోనితకి అనుమానం వస్తుంది. కానీ.. ఏదో చెప్పి కార్తీక్ కవర్ చేస్తాడు. అనంతరం దీపని రెచ్చగొట్టడానికి తను చేసిన నేరాలను చెబుతుంది మోనిత. ఆ తర్వాత అక్టోబర్ 22న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్, దీప దగ్గరకి ఏమైన వెళ్లాడేమోనని అక్కడికి వెళుతుంది మోనిత. కార్తీక్ని ఎలాగైనా సొంతం చేసుకుంటానని, ఇంతకుముందు చేసిన తప్పులను ఒప్పేసుకుంటుంది మోనిత. దాంతో.. కార్తీక్ లోపలే ఉన్నాడని చెబుతుంది దీప. అది విని కంగారు పడుతున్న మోనితని చూసి గట్టిగా నవ్వేస్తుంది దీప. అనంతరం అబద్దం చెప్పానని అంటుంది దీప. దాంతో మోనిత కోపంతో ఊగిపోతూ.. ‘నీ అంతు చూస్తాను’ అని దీపని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అనంతరం.. సౌర్య నవ్వు విన్న కార్తీక్ ఆమె గొంతు గుర్తు పట్టేస్తాడు. కానీ కనిపించదు. దాంతో.. అదే ఏరియాలో వెతకాలని అనుకుంటాడు కార్తీక్. అప్పుడే కార్తీక్ దూరమైపోతాడేమోనని బాధ పడుతుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్కి కొడుకు ఆనంద్ ఏడుపు వినిపిస్తుంది. దాంతో.. మోనిత మీద కోపంగా అరిచి బాబును ఎత్తుకుంటాడు. అనంతరం బాబుని తీసుకోబోతున్న మోనితని దుర్గ ఇంట్లో లేడని బాధ పడుతూ.. అదే ఆలోచనలో ఉన్నావా అని వెటకారంగా మాట్లాడతాడు కార్తీక్. అది విని.. ‘నువ్వు దూరమైపోతావేమోనని భయవేస్తుంది. నీ మాటల వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయింది’ అని ఏడుస్తూ అంటుంది మోనిత. దాంతో.. దొంగ ఏడుపులు మాని పిల్లాడిని మంచిగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు కార్తీక్. ఎందుకు ఇలా మారిపోయావని అడుగుతుంది మోనిత. దానికి.. ‘నాలో ఏ మార్పుకైనా నువ్వే కారణం మోనిత’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
మరోవైపు.. ‘పగలు మేడం దగ్గర డ్యూటీ. రాత్రి వంటలక్క ఇంటి దగ్గర కాపలా. రెండు పనులకు జీతం మాత్రం ఒక్కటే’ అని బాధగా అనుకుంటాడు శివ. శివని గమనించిన మోనిత.. దీప ఇంటి దగ్గరకి ఎందుకు వెళ్లావని అడుగుతుంది. దాంతో.. ‘సర్.. ప్రతి రాత్రి వంటలక్క ఇంటి ముందు పడుకోమని చెప్పాడు’ అని చెబుతాడు శివ. దాంతో.. ఏదో జరగుతోందని అనుమానపడుతుంది మోనిత. ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి మోనిత కాఫీ అడుగుతాడు. దాంతో.. ఫినాయిల్ కలిపి ఇస్తానని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. ఇంకోవైపు.. సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. అక్కడి వచ్చిన మోనిత కాఫీ కావాలా అని అడుగుతుంది. ఒకేనంటాడు కార్తీక్. కానీ.. దుర్గకి కాఫీ ఇచ్చావా అని వెటకారంగా అడుగుతాడు కార్తీక్. దాంతో.. వాడికి ఇవ్వనని కోపంగా అంటుంది మోనిత. ఇంతలో.. కాఫీ తాగుతూ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు దుర్గ. దాంతో.. మోనితని తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అది చూసి దుర్గ సంతోషపడుతుంటాడు. మోనిత మాత్రం వదిలేయామని దుర్గని వేడుకుంటుంది. ఆ సమస్యే లేదని చెబుతాడు కార్తీక్.
అనంతరం.. సంగారెడ్డిలో తన కూతురు దీపని చూడాలని అనుకుంటోందని ఇంద్రుడు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. అందుకే అతని ఆటోని వెతకాలని నిర్ణయం తీసుకుంటుంది దీప. మరోవైపు.. దీప, దుర్గ నుంచి ఏలాగైనా దూరంగా వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. దాంతో.. దీపని కార్తీక్కి కనిపించకుండా దూరంగా పంపించాలని అనుకుంటుంది మోనిత. అప్పుడు దీప మాత్రం ఇంద్రుడి ఆటో కోసమే వెతుకుతూ ఉంటుంది. కానీ ఆటో కనిపించకపోవడంతో బాధ పడుతుంటుంది. అక్కడే ఉన్న పాప్ కార్న్ బండిని చూసి.. సౌర్య అక్కడే ఉందేమోనని బాధగా అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలో పాప్కార్న్ తీసుకొని దీప దగ్గరకి వస్తాడు కార్తీక్. దాంతో.. మా సౌర్యకి పాప్ కార్న్ అంటే చాలా ఇష్టం డాక్టర్ బాబు అని చెబుతుంది దీప. అనంతరం సౌర్య కోసం వెతుకుతున్నాను అని చెబుతుంది. అలాగే తను వచ్చిన పని గురించి, ఆటో గురించి చెబుతుంది దీప. దాంతో.. ఇద్దరం కలిసి సౌర్యని వెతుకుదాం అంటాడు కార్తీక్. ఇంతలో.. ఆటోలో అటు వైపే వస్తుంటుంది సౌర్య. తన ఎదురుగా వస్తున్న ఆటోలో సౌర్యని చూసి గుర్తు పట్టేస్తుంది దీప. అదే విషయం కార్తీక్కి చెబుతుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్లో చూడండి.