Kerala Person : కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరక్షణ్ కుమారుడు అశోక్ అళిసెరిల్ తమరక్షన్ పాలక్కాడ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఆపై పై చదువుల కోసం బ్రిటన్ వెళ్లాడు. అనంతరం లండన్‌లో సెటిల్ అయ్యాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఫోర్డ్ మోటార్ కంపెనీలో పని చేస్తున్న ఆశోక్‌కు పర్యటనలంటే చాలా ఇష్టం. కరోనా సమయంలో కూడా ఇద్దరు ప్రయాణించగలిగే తేలికపాటి టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకుని చిన్న చిన్న పర్యటనలు చేస్తుండేవాడు. ఇంతవరకూ ఓకే కానీ.. ఆయన ఇటీవల చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అంతేకాదు.. ఆ విమానంలో ఆయన తన భార్యాపిల్లలతో కలిసి ఐరోపాలోని అనేక దేశాలు చుట్టొచ్చారు కూడా..! వినడానికి విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.
Kerala Person : అటువంటి విమానాలు చాలా అరుదు
తనకంటూ ఓ సొంత విమానం ఉండాలన్న ఆలోచన అశోక్‌కు కరోనా లాక్డౌన్ సమయంలో వచ్చింది. అతనికి అప్పటికే అంటే 2018లోనే పైలట్ లైసెన్స్ వచ్చింది. ఆ తరువాత.. ఇద్దరు ప్రయాణించగలిగే తేలికపాటి టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకుని చిన్న చిన్న పర్యటనలు చేస్తుండేవాడు. మరి వారి కుటుంబంలో నలుగురు ఉన్నారు. కుటుంబమంతా ప్రయాణించేందుకు వీలు కలగట్లేదు. దీంతో నలుగురు ప్రయాణించగలిగిన ఫోర్ సీటర్ విమానాలు ఉంటే బాగుండని భావించారు. అటువంటి విమానాలు చాలా అరుదు. అందుబాటులో ఉన్నవి కూడా పాత మోడళ్లే. దీంతో.. నేను ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతుండగా హోంబిల్ట్ విమానాల గురించి తెలిసింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే అశోక్ కొన్ని కంపెనీలు హోంబిల్ట్ విమానాలను(Home-built planes) విడి భాగాలుగా తయారుచేసి విక్రయిస్తుంటాయన్న విషయాన్ని తెలుసుకున్నాడు. వాటిని ఇంటికి తెచ్చుకుని కంపెనీ సూచనలను ఫాలో అయితే విమానాన్ని తయారుచేయవచ్చు. వీటిని కిట్ ప్లేన్ అని కూడా అంటారు. ఈ క్రమంలోనే స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ నుంచి అశోక్ ఓ కిట్‌ను కొనుగోలు చేశాడు. కంపెనీ సూచనల మేరకు దాదాపు రెండేళ్లు కష్టపడి విమానాన్ని తయారుచేశాడు. తన విమానానికి అశోక్ తన చిన్నకూతురు దియా పేరిట జీ-దియా అని నామకరణం చేశారు. బ్రిటన్‌లో ఇటువంటి విమానాలకు అనుమతి ఉండటంతో.. పౌర విమానయాన శాఖ అధికారులు అప్పుడప్పుడూ వచ్చి తనిఖీ చేసి వెళుతుండేవారు. ఫిబ్రవరిలోనే విమాన తయారైంది. ఆ తరువాత కొంత కాలానికే ఆయన తన సొంత విమానంలో టూర్ వేశారు. విమాన తయారీకి మొత్తం 1.8 కోట్లు ఖర్చైందని ఆశోక్ తెలిపాడు. ఈ విమానం గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పటికే అశోక్ తన కుటుంబంతో ఈ విమానంలో పలు దేశాలు చుట్టొచ్చారు. ఇప్పుడు ఈ స్టోరీ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.