రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా .. భిన్న నేపథ్యాలు కలిగిన ఒక జంట ప్రేమ కథతో రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి చాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి . అయితే సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తుంది ఖుషి టీమ్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫైడ్ వచ్చింది. ఈ విషయాన్ని ఒక రొమాంటిక్ పోస్టర్ తో హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.