Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 2019లో తెలుగు తెలుగు హీరోగా పరిచయమైన ఈయన తరచూ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు.ఇలా ఈయన హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈయనకు సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, సెబాస్టియన్ వంటి సినిమాలలో నటించే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
ఇకపోతే ఈయన నేను మీకు బాగా కావాల్సిన వాడిని అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా కూడా కిరణ్ అబ్బవరంకు సరైన హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా ఈయన నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో అభిమానులు ప్రేక్షకులు ఈయన సినిమాల పట్ల ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలలో ఈయన మాస్ క్యారెక్టర్ లో నటిస్తూ అచ్చం రవితేజను తలపించారు. ఇలా మాస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన రవితేజలాగే ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకొని హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారా అనే సందేహం కలిగింది. అయితే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈయనకు అవకాశాలు రావడం కూడా గగనమే అని అభిమానులు భావిస్తున్నారు.
Kiran Abbavaram: హిట్ ఇచ్చే దర్శకుడే లేరా…
ఇలా వరుస సినిమాలను చేస్తూ వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి ఈయన ఒక హిట్ సినిమాలో అయినా నటిస్తారా.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఒక హిట్టు కూడా పడకపోవడంతో హిట్ సినిమా ఎప్పుడొస్తుంది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈయనకు సరైన హిట్ ఇచ్చి దర్శకుడు ఎవరూ లేరా అనే సందేహం కూడా కలుగుతుంది.