Kotamreddy: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అధిష్టానంపై ఎదురుతిరిగి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలో తను ఇక ఇమడలేనని తేల్చేసి గౌరవంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి నిఘా పెట్టిన తర్వాత పార్టీలో ఉండాల్సిన అవసరం తనకి లేదని తేల్చేశారు. టీడీపీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే కోటంరెడ్డి నేరుగా ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకుల నుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరూ అతని మీద ఎదురుదాడి చేయడం మొదలు పెట్టారు.
టీడీపీకి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని ఇలా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అలాగే కోటంరెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అక్రమాలకి పాల్పడ్డారు అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. అలాగే నెల్లూరు రూరల్ లో ఇన్ చార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే వైసీపీ నాయకులు మూకుమ్మడిగా తనపై విమర్శలు చేయడంతో కోటంరెడ్డి మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు. తాను చేస్తున్నవి అసత్య ఆరోపణలు అని అనిపిస్తే హోం శాఖకి ఫిర్యాదు చేసి తనపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసుకోవాలని చాలెంజ్ చేశారు.
నేను కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకులకి జైళ్ళు భాగా కలిసివస్తాయని పరోక్షంగా జగన్ మీద కౌంటర్ వేశారు. అలాగే తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, భయపడే ప్రసక్తే లేదని, ఆపాలని అనుకుంటే ఎన్ కౌంటర్ చేయండి. అప్పుడే నా గొంతు ఆగుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు నాపై సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే నాయకులు విమర్శలు చేస్తున్నారని వాటిపై క్లారిటీ ఇవ్వడానికి మీడియా ముందుకి వచ్చినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.