టాలీవుడ్ చెలన చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్-హీరోయిన్ అనుష్కల జంటకి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయంతెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం మాత్రం రావడం లేదు అంటున్నారు . మా మధ్య అలాంటిది ఏం లేదని.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని అంటున్నారు అటు అనుష్క, ఇటు ప్రభాస్. చాలా సందర్భాల్లో వివరించి చెప్పారు . కానీ అభిమానులు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ప్రభాస్-అనుష్క జంటగా బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో నటించారు. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉండటంతో ఈ జంటకి ఫ్యాన్స్ పెరిగిపోయారు
తాజాగా ప్రభాస్-అనుష్క గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది . ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయనతన డైరీలో ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి రాసుకున్నారట. ప్రభాస్ పిల్లలను ఎత్తుకొని ఆడించాలని కలలు కూడా కనేవారట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి పై అప్పట్లో రకరకాల వార్తలు బాగా వినిపించాయి. కృష్ణంరాజుకు అనుష్క ల పట్ల మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. ఆమె మంచి విలువలు కలిగిన అమ్మాయి అని చాలా సందర్భాల్లో ఆమె పేరును కూడా తన డైరీలో ప్రస్తావించినట్టు సమాచారం అని తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజు కూడా ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాల సార్లు అనుకున్నారంతా .
![ప్రభాస్-అనుష్క పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా ? 2 ప్రభాస్-అనుష్క పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-05T154145.466.jpg)
కానీ అటు అనుష్క, ఇటు ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఏం చెప్పడం లేదు . మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చాల సార్లు చెప్పుకొచ్చారు . అయినా ఫ్యాన్స్ మాత్రం స్నేహబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కృష్ణంరాజు అనారోగ్యానికి గురైనప్పుడు అనుష్క ఆసుపత్రికి వెళ్లడంతో ప్రభాస్, అనుష్క రిలేషన్ షిప్ పై చాలా వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ప్రభాస్, అనుష్కలు స్పందించలేదు. ఎవ్వరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ సలార్, కల్కీ మూవీస్ తో పాటు మరో రెండు మూడు సినిమాలుచేస్తున్నారు. అనుష్క మాత్రం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉంది. మరోవైపు వీరిద్దరూ కలిసి మరో సినిమాలో నటిస్తున్నారని కూడా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంత వరకు వాస్తవమో వేచి చూడాలి మరీ.