హీరోయిన్ కృతిశెట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అంటే ఒక బడా స్టార్ హీరో పుత్రుడు కృతిశెట్టి ని వేధిస్తున్నట్లు… తొందరలో రాబోయే తన బర్త్ డే పార్టీకి తప్పకుండ హాజరు కావాలని ఫోర్స్ చేసినట్లు అవసరం అయితే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
![స్టార్ హీరో కొడుకు వేధింపులపై క్లారిటీ ఇచ్చిన కృతిశెట్టి.... 2 స్టార్ హీరో కొడుకు వేధింపులపై క్లారిటీ ఇచ్చిన కృతిశెట్టి....](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-07T153037.249.jpg)
తాజాగా హీరోయిన్ కృతిశెట్టి ఈ వార్తపై స్పందించింది. అసలు ఈ ప్రచారానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఇలాంటి ఫేక్ వార్తలను నేను అస్సలు పట్టించుకోను అంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేను ఊరుకున్నాకొద్ద్ది కొద్దీ రోజు రోజుకీ న పై ఇష్టం వచ్చినట్లు అన్ని ఫేక్ న్యూస్లు రాస్తున్నారు అంటూ అసత్య వార్తలను రాసే మీడియా వారిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది కృతిశెట్టి.
ఇకపై నాపై ఇలాంటి వార్తలను రాసే ముందు నన్ను కలవండి అవి నిజమో కాదో తెలుసుకుని రాయండి అని చెప్పుకొచ్చింది .ఇక కృతి శెట్టి ఇచ్చిన క్లారిటీ తో ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కావాలనే ఇలాంటి వార్తలు ప్రచారం చేశారని తెలుస్తోంది.