సీనియర్ స్టార్ హీరోలు సినిమాలు చేసే క్రమంలో వారికి కథలు, డైరెక్టర్స్ కంటే ఇబ్బంది పెట్టే అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది!! అంటే అది హీరోయిన్ ఎంపిక. ఇప్పుడు తెలుగులో ఇండస్ట్రీ లో ఉన్న నలుగు సీనియర్ హీరోలు ఆరు పదులు వయసువారే. వీరికి అప్ కమింగ్ హీరోయిన్స్‌ను తీసుకొస్తే వారికీ జోడి అవ్వరు. అలాగని కాస్త సీనియర్ హీరోయిన్ను తీసుకొద్దాం అంటే జంట చూడటానికి బాగోదు కనుక తేలేరు. వీరికి సరిపడా హీరోయిన్స్ ఉన్నా కూడా వారి డేట్స్ అడ్జస్ట్మెంట్లో సమస్య ఉండటం, ఇతర సినిమాలలో బిజీగా ఉండటం వంటి కారణాలుంటాయి. దీని వల్ల సీనియర్ హీరోలకు వెయిటింగ్, తిరస్కరణలు తప్పడం లేదు అనేది ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న విషయమే.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించమని ఓ కుర్ర హీరోయిన్ని అడిగితే ఆమె రిజెక్ట్ చేసిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య సరసన నటించడానికి నో చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కృతి శెట్టి. ఉప్పెన, బంగార్రాజు చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మను బాలయ్య లేటెస్ట్ మూవీ NBK 107లో నటింప చేయాలని మేకర్స్ ప్రయత్నించారని సమాచారం. అయితే అమ్మడు అందుకు ససేమిరా నో అనేసిందట. అందుకు కారణం.. ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న తను, సీనియర్ హీరో పక్కన నటిస్తే కెరీర్ ఢీలా పడే అవకాశం ఉందని భావించిందని సమాచారం. మరి నెట్టింట హల్ చల్ చేస్తున్న ఈ వార్తల్లో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి.
NBK 107 చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్గా చేస్తోంది. అఖండ తర్వాత బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం.