సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు, తమిళ్ భాషా సినిమా లలో అగ్ర హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పటికీ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి యంగ్ హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తోంది. ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్న ఈమె ఇండస్ట్రీలో తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అంటూ పలు సందర్భాలలో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.
తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని.. అయితే ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అని అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే తాజాగా మరో ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఈమె చేసిన కామెంట్లు తేగా వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ అంటే నాకు చాలా కాలం నుంచి బాగా ఇష్టం.. ముఖ్యంగా ఆయన దగ్గర ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పటికీ కూడా ఆ ఆశ నెరవేరలేదు అంటూ ఈ సందర్భంగా ఖుష్బూ తెలియజేసింది. ఇకపోతే ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ కు ప్రేక్షక అభిమానులే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో ఆయనకున్న మంచి క్రేజ్ అటువంటిది మరి . మరి ఇప్పటికైనా కుష్బూ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు . ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ నాటికి విడుదలు కాబోతుంది . మరొకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.