నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో బింబిసారా మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అతని కెరియర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన చిత్రం కూడా ఇదే. అలాగే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. రెండు విభిన్న కాలాల మధ్య టైం ట్రావెల్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం ప్రతి ఒక్కరికి బాగా రీచ్ అయ్యింది. దీంతో సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకుడుగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ దర్శకుల సరసన చేరిపోయాడు.
శ్రద్ధతో సినిమాని చేస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ దర్శకుడు నిరూపించాడు. ఇక కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసారా 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి ఇప్పటికే స్టోరీ స్లాట్ ని దర్శకుడు వశిష్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక స్టోరీ ప్రకారం ఈ సీక్వెల్ లో మెయిన్ విలన్ గా ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ నడుస్తుంది. రాక్షసి పాత్రని మెయిన్ విలన్ గా దర్శకుడు సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు బోగట్టా. ఆ పాత్రకి స్టార్ హీరోయిన్ ఉంటేనే ఆ స్థాయిలో బింబిసారా సీక్వెల్ కి హైప్ వస్తుందని భావిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి అవసరం అయితే బాలీవుడ్ హీరోయిన్ ని చూడాలని అనుకుంటున్నారు. అలాగే తమన్నా పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో విలన్ పాత్ర ఉంటుంది కాబట్టి అందంతో అభినయం కూడా అద్భుతంగా ఉండే నటి కోసం దర్శకుడు వెతుకుతున్నాడు. అయితే అంతకంటే ముందుగా కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమా సెట్స్ పైన ఉంది కాబట్టి అది కంప్లీట్ అయ్యేలోపు దర్శకుడు కథని సిద్ధం చేసే పనిలో పడ్డట్లు సమాచారం .