డైరెక్టర్ లోకేష్ కనగరాజు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ నడుస్తోంది.తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. తక్కువ సినిమాలే చేసినా.. తనదైన ముద్ర వేశాడు.
ఖైదీ సినిమాతో లోకేష్ కనగరాజ్ పేరు మారుమోగిపోయింది. మస్టర్, విక్రమ్ లాంటి సినిమాలో క్రేజ్ పెరిగిపోయింది. విక్రమ్ సినిమాకు అయితే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. బాక్సాఫీసును షేక్ చేసేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు.
ఇటీవల లోకేష్ కనగరాజ్.. తాను ప్రభాస్ తో నిజంగా కలిసి పనిచేయనున్నట్టుగా చెప్పాడు. ఇది వారి కెరీర్లో అతిపెద్ద చిత్రం అవుతుందని అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా పేరు ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే వేరే లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్‌తో తన సినిమాపై లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దళపతి విజయ్ తో లియోను పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌పై పని ప్రారంభిస్తాడు లోకేష్.