Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం SSMB28. ఈ చిత్రం రిలీజ్ కు ముందే భారీ మార్కెట్ ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ రూ.81 కోట్లకు విక్రయించింది. ఇది తెలుగు ఓటీటీ మార్కెట్ లో అతిపెద్ద డీల్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో పొడవు కాళ్ళ సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. 2023లో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ని హారిక & హాసిని క్రియేషన్స్ ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీం లో జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, జాతీయ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎస్ థమన్ ,సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ లు ఉన్నారు.

మహేష్ బాబు ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. గడ్డంతో కనిపిస్తున్న మహేష్ లుక్ అభిమానులలో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది . అతడు , ఖలేజా విజయాల తర్వాత, మహేష్ ,త్రివిక్రమ్ కలయిక నుండి అభిమానులు మరో బ్లాక్ బస్టర్ వస్తుందని ఆశిస్తున్నారు.
మహేష్ చివరిసారిగా 2022 విడుదలైన సర్కారు వారి పాటలో కనిపించాడు. అయితే ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, SSMB28 తో, అభిమానులు బ్లాక్ బస్టర్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే మహేష్ బాబు రాజమౌళితో చిత్రాన్ని ప్రారంభించనున్నారు.