టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ప్రముఖ సినీ, రాజకీయ ప్రముకులు, అభిమానులు మహేశ్ బాబు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు . సోషల్ మీడియా మొత్తం ఈ రాజకుమారుడి బర్త్ డే విషెస్తోనే ఓవర్ ఫ్లో అవుతోంది. #HBDMaheshbabu ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు జన్మదినం ని పురస్కరించుకుని ‘గుంటూరు కారం’ చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.
![మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. కొత్త పోస్టర్ వదిలిన గుంటూరు కారం టీమ్ 2 మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. కొత్త పోస్టర్ వదిలిన గుంటూరు కారం టీమ్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-09T110858.695.jpg)
బుధవారం అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం నుంచి మహేశ్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మహేశ్ లుంగీ కట్టుకుని మాస్ లుక్లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. ఓ చేత్తో స్టైలిష్గా చుట్టా కాలుస్తూ కనిపించాడు మహేష్ . ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన శ్రీలీల నటిస్తోంది.