కొడుకు గౌతమ్ కి మహేష్ బాబు బర్త్ డే విషెస్
ప్రిన్స్ ఘట్టమనేని గౌతమ్ పుట్టినరోజు నేడు. మహేష్ బాబు వారసుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు .
నేడు గౌతమ్ ఘట్టమనేని జన్మదినం. 2006 ఆగస్టు 31న జన్మించిన గౌతమ్ 17వ ఏట అడుగుపెడుతున్నారు . గౌతమ్ కి తండ్రి మహేష్ బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు . ”హ్యాపీ 17. నువ్వు నా ఛాంపియన్. నా ప్రతి అడుగు నిన్ను లక్ష్యం వైపు నడిపిస్తాయి. ఆకాశం హద్దుగా ఎదగాలి” అని కామెంట్ చేశాడు. మహేష్ బాబు పోస్ట్ వైరల్ అవుతుంది.
మహేష్ కి పిల్లలంటే అమిత ప్రేమ. ఆయనకు షూటింగ్స్ లేకపోతే కుటుంబమే ప్రపంచం. ప్రతి ఏడాది లెక్కకు మించిన టూర్స్ కి వెళుతుంటారు. ఫ్రాన్స్, లండన్, దుబాయ్, యూఎస్ వీరి ఇష్టమైన వెకేషన్ ప్లేసెస్ అంట . ఇక గౌతమ్ విషయానికి వస్తే… తన అందం, గుణంలో ఆచం తన తండ్రి పోలికే. చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. సోషల్ మీడియా పెద్దగా వాడడు.
గౌతమ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని ఇటీవల అమ్మ నమ్రత శిరోద్కర్ ని అడగడం జరిగింది . గౌతమ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు పూర్తయ్యాక దీనిపై ఆలోచన చేస్తాము. ఇంకా కొంత సమయం ఉందని ఆమె వెల్లడించారు. గౌతమ్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేశాడు. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే సినిమా లో మహేష్ బాబు చైల్డ్ రోల్ గౌతమ్ చేసి మెప్పించాడు.
ఇక తండ్రి వలె సామాజిక స్పృహ కూడా ఎక్కువే. స్కూల్ నుండి వచ్చాక గౌతమ్ హాస్పిటల్స్ ని సందర్శిస్తాడట. మహేష్ బాబు ఫౌండేషన్ తరపున చికిత్స తీసుకుంటున్న చిన్నారులను కలుస్తాదంట . ముఖ్యంగా రైన్ బో హాస్పిటల్ కి గౌతమ్ తరచుగా వెళుతుంటాదంట . ఈ విషయాన్ని నమ్రత తెలియజేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి గుండె జబ్బుతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్న విషయం తెలిసిందే…